Home తాజా వార్తలు ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు జూన్ 7 నుంచి

ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు జూన్ 7 నుంచి

Intermediate exam

జూన్ 7 నుంచి 14 వరకు పరీక్షలు
మనతెలంగాణ/హైదరాబాద్: ఇంటర్మీడియేట్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు మరోసారి వాయిదా పడ్డాయి. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం మే 16 నుంచి జరగాల్సి ఉండగా, మే 25 నుంచి వరకు నిర్వహించేలా గతంలో వాయిదా వేసిన ఇంటర్ బోర్డు మరోసారి వాయిదా వేసి జూన్ 7 నుంచి నిర్వహించేలా షెడ్యూల్ విడుదల చేసింది. జూన్ 15 నుంచి 18వ తేదీ వరకు ఇంటర్ సప్లిమెంటరీ ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించనున్నట్లు ఇంటర్ బోర్డు కార్యదర్శి ఎ.అశోక్ ఒక ప్రకనటలో తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ప్రథమ సంవత్సరం పరీక్షలు, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు ద్వితీయ సంవత్సరం పరీక్షలు జరుగుతాయి. జూన్ 19వ తేదీన ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు నైతికత, మానవ విలువల పరీక్ష, జూన్ 20వ తేదీన పర్యావరణ విద్యపై పరీక్షలు ఉంటాయి. ఇంటర్ ఒకేషనల్ కోర్సులకు ఇదే పరీక్షల షెడ్యూల్ ఉంటుందని, ఆ పరీక్షలకు ప్రత్యేకంగా షెడ్యూల్ విడుదల చేయనున్నట్లు అశోక్ పేర్కొన్నారు. ఫెయిలైన విద్యార్థుల జవాబు పత్రాల రీ వెరిఫికేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. రీవెరిఫికేషన్ ఫలితాల వెల్లడికి మరికొన్ని రోజులు పట్టే అవకాశమున్న నేపథ్యంలో సప్లిమెంటరీ పరీక్షలను మరోసారి వాయిదా వేశారు.

Inter Supplementary exams 2019 postponed in Telangana