Home కరీంనగర్ వడ్డీ వ్యాపారం విలువ రూ.500 కోట్లా!

వడ్డీ వ్యాపారం విలువ రూ.500 కోట్లా!

ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్న  ఎఎస్‌ఐ మోహన్‌రెడ్డి అక్రమాలు
తెలుగు రాష్ట్రాల్లో ఏ జిల్లానూ వదలని వైనం పెరుగుతున్న ఫిర్యాదుల సంఖ్య
వేగంగా విచారిస్తున్న సిఐడి
కేసును సిబిఐ అప్పగించాలంటూ బాధితుల డిమాండ్

వడ్డీ వ్యాపారంతో కోట్లకు పడగలెత్తిన ఎఎస్‌ఐ బొబ్బల మోహన్ రెడ్డి అక్రమాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి! గతంలో వచ్చిన ఫిర్యాదులను మామూలుగా తీసుకున్న జిల్లా పోలీస్ యంత్రాంగం ఐదు రోజుల్లోనే దిమ్మదిరిగే నిజాలు తెలియడం తో విస్తుపోయింది! ఈ మేరకు మొదటినుంచీ మోహన్‌రెడ్డి ప్రవర్తనపై పలుమార్లు ఫిర్యాదులు చేసిన లోక్‌సత్తా ఉద్యమ సంస్థ మరోమారు రంగం లోకి దిగడం తో బాధితులు క్యూ కట్టారు! ఓవైపు పోలీస్ చెరలో నిందితుడిని సిఐడి విచారిస్తుండగా, మరోవైపు లోక్‌సత్తా ఉద్యమ సంస్థ ఇచ్చిన పిలుపుమేరకు కరీంనగర్ ప్రెస్‌క్లబ్‌లో బాధితులు పెద్దసంఖ్యలో వచ్చి తమ గోడు వెళ్లబోసుకుంటున్నారు!

Reddyమన తెలంగాణ/కరీంనగర్: గత నెల 29న ఆత్మహత్య చేసుకున్న కరీం నగర్ కెన్‌క్రెస్ట్ విద్యాసంస్థల అధినేత రా మవరం ప్రసాదరావు ఉదంతంతో ఎఎస్ ఐ బొబ్బల మోహన్ రెడ్డి అక్రమాలు ఒక్కొ క్కటిగా వెలుగుచూస్తున్నాయి. ప్రస్తుతం పోలీసులు విచారిస్తున్న మోహన్‌రెడ్డి సహా బినామీల చిట్టా పద్దు ఇప్పటికే రూ.500 కోట్లు దాటినట్టు సమాచారం. దీనికి తోడు తాజాగా ప్రెస్‌క్లబ్‌లో లోక్‌సత్తా ఉద్యమ సంస్థ బృందం ముందు గోడు వెళ్లబోసు కున్న వారి సమచారం ప్రకారం మోహన్ రెడ్డి అక్రమ సంపాదన మరింత పెరిగే అ వకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఐదు రోజు లుగా పోలీసుల చెరలో ఉన్న మోహన్ రెడ్డి కేసును సిఐడికి అప్పజెప్పడంతో అధికారు లు విచారణ వేగవంతం చేసినట్లు కనిపి స్తుండగా, ఇప్పటివరకు అదుపులో తీసు కున్న బినామీల సమాచారం మేరకు మో హన్‌రెడ్డి చేతిలో ఎందరి ఆస్తులు ఉన్నయో తేటతెల్లమయ్యే అవకాశముంది. బుధవా రం ప్రెస్‌క్లబ్‌లో సమావేశమైనా బాధితులు సదరు ఖాకీ తమ ఆస్తులకు సంబంధించి న అప్పు చెల్లించేందుకు వెళ్లినా వాటిని కా జేసే ఉద్యేశ్యంతో ఇబ్బందులకు గురిచేయ డమే కాకుండా, ఏదో ఒక రూపంలో వడ్డీ పెంచి ఆస్తులను కాజేసినట్టు ఆధారలతో సహా తెలిపినట్లు సమాచారం. ఎదురు తిరి గితే సర్వీస్ రివాల్వర్‌తో బెదిరించేవాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది మాత్రమే కా కుండా తను సొంతంగా ఏర్పాటు చేసుకు న్న ప్రైవేట్ సైన్యంతో మోహన్ రెడ్డి అక్ర మాలకు అడ్డూ అదుపు లేకుండా పోయిం ది. ఇదిలాఉంటే మోహన్‌రెడ్డి కేవలం తె లంగాణ జిల్లాలేనే కాకుండా పక్క రాష్ట్రమై న ఆంధ్రాలోనూ తన వ్యాపార సామ్రా జ్యాన్ని విస్తరించినట్లు సమాచారం. నింది తుడు ఇంతకుముందు సిఐడి విభాగం లోనే పనిచేయడం, జిల్లాలో ఎస్‌ఐ స్థాయి నుంచి 25 ఏళ్లుగా పనిచేస్తూ ఉన్నతస్థా యి అధికారిగా నాలుగేళ్లు జిల్లా కేంద్రం లో పనిచేశాడు. అయితే మోహన్ రెడ్డి సా మాజిక వర్గానికి చెందిన మరో పోలీస్ ఉ న్నతాధికారి కూడా ఈ దందాలో పెట్టుబ డులు పెట్టినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఎస్‌పి అతగాడిని ఈ కేసు వైపు కన్నెత్తి చూడొద్దంటూ, ఎలాంటి ప్రమేయం చేసు కోవద్దంటూ హెచ్చరించినట్టు సమాచా రం. అంతేకాకుండా సిఐడి ఆధ్వర్యంలో తమకు న్యాయం జరిగే అవకాశం తక్కువ అంటూ అనుమానం వ్యక్తం చేసిన బాధి తులు వెంటనే కేసును సిబిఐకి అప్పజె ప్పాలని డిమాండ్ చేస్తున్నారు.

తుపాకీతో బెదిరించాడు
మాకున్న ఏడెకరా ల భూమిని రూ. 25 లక్షల కోసం జిపిఎ చేసుకొని నె లకు రూ.5 లక్షల చొప్పున ఐదు నెల లిచ్చి 11 నెలల తర్వాత వడ్డీతో రెట్టింపు చేసి తన తండ్రి పేరుమీద బలవంతంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. మాకున్న మరో భూమిని అమ్మి మొత్తం డబ్బులు క ట్టేందుకు వెళితే భూమి ఇచ్చేది లేదని తు పాకీతో బెదిరించాడు. దాదాపు రూ.కోటి భూమిని రూ.25 లక్షలకే కబ్జా చేశాడు. అంతేకాకుండా నా భర్తను బెదిరించడం తో భయానికిలోనై గుండెపోటుతో మర ణించాడు. నాకు ఇప్పటికైనా న్యాయం చేయాలి.
– బోగ లక్ష్మి, గ్రామం కొడిమ్యాల
నా భర్త ఎక్కడున్నాడో..
హెచ్‌డిఎఫ్‌సి బ్యాం కులో గతంలో రూ. 6 లక్షల క్రాప్ లోన్ కోసం మా ఏడెకరా ల వ్యవసాయ భూ మిని కుదవపె ట్టాం. ఆ డబ్బులు కట్టడం కోసం ప్రయ త్నిస్తున్న సమయంలో మా సమీప బం ధువు ద్వారా మోహన్ రెడ్డి తక్కువ వడ్డీకి సహాయం చేస్తామని చెప్పి బ్యాంక్ నుంచి తమ దస్త్రాలను బినామీ పేరుమీద జిపిఎ చే యించి సహాయం చేసినట్టే చేసి మాకు తె లియకుండానే ఇతరులకు అమ్మేశాడు. నా భర్త అడగడానికి వెళితే తీవ్రంగా కొట్ట డంతో ఇప్పటివరకు (రెండేళ్లుగా) ఇంటి కి రాలేదు. ఎక్కడున్నాడో తెలియదు.
– కాంతాల స్వప్న, నవాబుపేట, (చిగురుమామిడి మండలం)
కొట్టించి బెదిరించాడు..
నా భూమికి పక్కనే మరో భూమి భూ మిని కొనుగోలు చే సిన మోహన్‌రెడ్డి తన భూమిని తీసు కునేందుకు లేని తగాదాలు సృష్టించి అమ్మివేయలంటూ బెదిరింపులకు గురిచేశాడు. అ తర్వాత రోడ్డును ఇవ్వాలంటూ అనుచరులను పంపి తీవ్రంగా కొట్టడమే కాకుండా బెది రింపులకు గురిచేస్తున్నాడు. లేదంటే డ బ్బులు అప్పుతీసుకొని తన పేరున జిపిఎ చేయాలంటూ ఈ మధ్య కాలంలో ఇంటి పై దాడి చేశాడు. పోలీస్ కేను నమోదు చేశాను. అయినా అతడిపై ఎలాంటి చ ర్యలు తీసుకోలేదు.
– రాంగోపాల్‌రెడ్డి , అంకిరెడ్డి పల్లి, (సిరిసిల్ల మండలం)
ఎంత దూరమైనా పోతాం..
పోలీసుల వ్యవస్థ ను ఎదుర్కొనడం కోసం మోహన్ రె డ్డి లాంటి చీటర్లను ప్రజల ముందు ఉంచేందుకే మా ఈ ప్రయత్నం. వ యోబేధం, ఆర్థిక పరిస్థితులను మరచి ఎ వ్వరినీ వదలకుండా మోహన్ రెడ్డి చేసిన అక్రమ వడ్డీ వ్యాపారంపై పోరాటం కో సం ఎంత దూరమైనా పోతాం. వెంటనే ఈ కేసుపై ఎస్‌పి హెల్ప్ డెస్క్ ను ఏర్పాటు చేయాలి. హైకోర్టు ద్వారా, సిబిఐ ద్వారా విచారణ చేపట్టాలి. ప్రస్తుతం ఎస్‌పి చూ పెడుతున్న చొరవకు మేము అభినందన లు తెలుపుతున్నాం.
– ఎన్.శ్రీనివాస్, లోక్‌సత్తా ఉద్యమనేత, కరీంనగర్