Home జాతీయ వార్తలు వడ్డీ రేటు తగ్గించిన ఆర్‌బిఐ

వడ్డీ రేటు తగ్గించిన ఆర్‌బిఐ

RBIముంబయి : ఆర్‌బిఐ కీలక వడ్డీ రేటును తగ్గించింది.  రెపో రేటు (బ్యాంకులకు ఆర్‌బిఐ ఇచ్చే రుణంపై వడ్డీ రేటు)ను 25 బేసిస్ పాయింట్ల మేర తగ్గించిందని ఆర్‌బిఐ వర్గాలు తెలిపాయి.  దీంతో 6.5 శాతంగా ఉన్న రెపో రేటు 6.25 శాతానికి తగ్గింది. వడ్డీ రేటు తగ్గింపు కారణంగా రుణాలపై వడ్డీ భారం తగ్గనుందని ఆ వర్గాలు తెలిపారు. ఆర్‌బిఐ  చైర్మన్ శక్తికాంతదాస్ నేతృత్వంలోని మానిటరీ పాలసీ కమిటీ ఈ కీలక నిర్ణయం తీసుకుంది. రివర్స్ రెపో రేట్ (ఆర్‌బిఐకి బ్యాంకులు ఇచ్చే రుణంపై వడ్డీ)ను 6 శాతానికి, మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ రేట్‌ను 6.5 శాతంగా ఉంచారు. ద్రవ్యోల్బణాన్ని 4 శాతంగా ఉంచే లక్ష్యంతో ఈ కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు ఆర్‌బిఐ చైర్మన్ శక్తికాంతదాస్ వెల్లడించారు.

Interest Rate Cut by RBI