Home తాజా వార్తలు రైలు పట్టాలపై విద్యార్థి మృతదేహం

రైలు పట్టాలపై విద్యార్థి మృతదేహం

5nzb03p2విద్యార్థి జేబులో సూసైడ్ నోట్, మృతిపై పలు అనుమానాలు
నిజామాబాద్ అర్బన్: హాస్టల్లో ఉండటం ఇష్టం లేదని ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతున్న ఓ విద్యార్థి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న సంఘటన బుధవారం జిల్లా కేంద్రంలో వెలుగుచూసింది. బోధన్ ప్రాంతానికి చెందిన ఈ విద్యార్థి మరణంపై కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి… రెంజల్ మండలం బాగేపల్లి గ్రామానికి చెందిన జనార్ధన్ టైలర్‌పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఇతని కొడుకు సాయికుమార్(16) పదవ తరగతి పూర్తి చేసుకోవటంతో.. ఇటీవలే బోధన్ లోని విద్యావికాస్ జూనియర్ కళాశాలలో బైపీసీ విభాగంలో చేర్పించారు. తన కొడుకు ఉన్నత చదువులకు ఇబ్బందులు ఏర్పడవద్దని రెండు నెలల క్రితం సాయికుమార్‌ను హాస్టల్లో చేర్పించారు. అయితే బుధవారం జిల్లా కేంద్రంలోని ఎల్లమ్మగుట్ట చివరి భాగంలో రైలు బ్రిడ్జి వద్ద పట్టాలపై శవమై తేలాడు. మృతుడి చేతిపై తన తండ్రి ఫోన్ నెంబరు రాసి ఉంది.
5nzb03p3సూసైడ్ నోట్‌లో ఏముందంటే..
‘అమ్మా.. నాకు ఇక్కడ హాస్టల్లో ఉండటం ఇష్టం లేదు. మిమ్మల్ని విడిచిపెట్టి ఉండలేక పోతున్నాను. అందుకని నేను చనిపోతున్నాను. నేను చనిపోయానని మీరు బాధపడకండి. నేను ఎక్కడ ఉన్నా సంతోషంగా ఉంటాను. నేను చనిపోయానని మీరు ఎలాంటి ఆత్మహత్యలు చేసుకోవద్దు. అమ్మా, నాన్నా మీరు ఎలాంటి గొడవలు పడవద్దు. మీరు ఎప్పుడు సంతోషంగానే ఉండాలి. మీరు సంతోషంగా ఉంటేనే నేను కూడా సంతోషంగా ఉంటాను.
ప్రిన్సిపల్ సార్..! దయచేసి మేము కట్టిన ఫీజు మా ఇంటికి పంపించండి. మొత్తం డబ్బు ఇవ్వకపోయినా.. కనీసం అందులో కొంచెం అయినా ఇవ్వండి సార్. ఇవే నా ఆకరి కోరికలు..’ అని రాసి ఉంది. చివరగా.. ‘మా అమ్మానాన్న సంతోషంగా ఉంటే నేను కూడా పైన సంతోషంగానే ఉంటాను.’ అని చెప్పి.. ఇట్లు..నీ కుమారుడు, సాయికుమార్/ ఇంటర్ ఫస్ట్ ఇయర్ అని రాసి ఉంది. రైల్వే పోలీసులు ఆత్మహత్యగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 5nzb03p1