Search
Thursday 20 September 2018
  • :
  • :
Latest News

అధికార పార్టీలో…అంతర్గత వార్

  • ప్రోటోకాల్‌పై ప్రశ్నించిన ఎంపిపి
  • సభ్యులను తీసుకొని బయటకు వెళ్లిన పిఎసిఎస్ చైర్మన్
  • మండల సమావేశాన్ని వాయిదా వేసిన ఎంపిడిఒ

Ruling-Partyకాసిపేట : ఇక్కడ ప్రతి పక్షం లేదు, ఉన్నది అంతా అధికార పక్షమే కాని మండల సమా వేశంలో అధికార పార్టీ నేతల మధ్య అంతర్గత వార్ నెలకొంది దీంతో మరోసారి మండల సమావేశం వాయిదా పడింది. బుధవారం కాసిపేట మండల స ర్వసభ్య సమావేశం మండల అభివృద్ధి కార్యాలయ ంలోని సమావేశపు మందిరంలో ఎంపిపి శంకరమ్మ అధ్యక్షతన మొదలు కాగా ఎంపిపి ముదాం శంకర మ్మ వేదికపై ఫొటో కాల్‌పై ఎంపిడిఒను ప్రశ్నించి ంది. సింగిల్‌విండో చైర్మన్ వేధిక మీద ఎలా కూర్చుంటాడని ఆమె ప్రశ్నించడంతో ఎంపిడిఒ అధికారిక ంగా లేదని, కాని సర్ధుకుపోయో దోరణిలో అని పే ర్కొన్నగా, ఎంపిపి శంకరమ్మ ఆగ్రహాం వ్యక్తం చేస్తు తాను ఇక్కడ ఎందుకు మీరే సమావేశాన్ని నిర్వహిం చుకోండి అంటూ వేధిక మీద నుంచి వెళ్లి పోయెందుకు సిద్ధం అయ్యింది.
ఈ నేపథ్యంలో సింగిల్‌విండో చైర్మన్ వంశీధర్ రావు సమావేశంలో ఉన్న కొందరు ఎంపిటిసిలు, ఏనుగు మంజుల, బన్న స్వరూప, దాసరి శ్రీకాం త్, సర్పంచ్‌లు బదావత్ నీల, బందెల ప్రేంకుమార్ ను తీసుకొని బయటకు వెళ్లిపోవడంతో అక్కడ గం దరగోళ పరిస్థితి నెలకొంది. సభ్యులు సమావేశ మందిరం నుంచి బయటకు వెళ్లి పోవడంతో సభ మ ధ్యాంతరంగా ఆగిపోయింది. దీంతో ఎంపిడివో అ బ్దుల్‌హై ఇటు ఎంపిపితో, అటు సభ్యులతో చర్చించి నప్పటికి ఎవరు కూడా బెట్టు వీడక పోవడంతో మం డల సమావేశాన్ని మరోసారి వాయిదా వేసినట్లు ప్రకటించారు.
అంతర్గత కలహాలే కారణం?
అధికార పార్టీకి చెందిన ఎంపిపి ముదాం శంకర మ్మ, సింగిల్‌విండో చైర్మన్ వంశీధర్‌రావుల మద్య అ ంతర్గత విభేదాల వల్లే మండల సమవేశంలో ఇరు వర్గాల మద్య వార్ జరిగినట్లు తెలుస్తోంది. ఈ సంద ర్భంగా ఎంపిపి శంకరమ్మ తన ఆవేదనను వెళ్లగ్రక్కా రు. తాను ఎంపిపి అయినప్పటికి తనకు విలువ ఇ వ్వడం లేదని, ఏ కార్యాక్రమానికి పిలువకుండా వు ంటున్నారని, కేవలం తనను ఫొటోకు ముందు పెట్టి తన పేరు రాయించి వారు ఆధిపత్యం చెలాయిస్తు న్నారని ఆమె ఆగ్రహాం వ్యక్తం చేసింది.
ఎంపిపితో కుట్ర పన్నుతున్నారు
ఒకే పార్టీకి చెందినప్పటికి కావాలని కొందరు ఎం పిపితో కలసి పార్టీ ప్రతిష్టను దెబ్బతీసు కుట్రలు చే స్తున్నారని సింగిల్‌విండో చైర్మన్ వంశీధర్‌రావు, స భ్యులు పేర్కొన్నారు. కావాలని చిన్న విషయంపై రా ద్దాంతం చేస్తున్నారని వారో ఆరోపించారు.
రెండోసారి మండల సభ వాయిదా
ప్రజల సమస్యలపై చర్చించి సమస్యల పరిష్కారా నికి వేధిక ఐన మండల సభ రెండో సారి వాయిదా పడింది. మూడు నెలల క్రితం నియోజకవర్గం ప్రతి నిధి కొరకు సమావేశాన్ని వాయిదా వేయగా నేడు అధికార పార్టీలో సభ్యుల మధ్య నెలకొన్న అంతర్గత కలహాల వద్ద మరో సారి సభ వాయిదా పడింది.

Comments

comments