Search
Friday 16 November 2018
  • :
  • :

అశ్విన్‌కు మరో అవార్డు

Ashwin

ముంబయి: భారత స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ మరో అరుదైన అవార్డును తన ఖాతాలో జమచేసుకున్నాడు. ఇంటర్నేషనల్ క్రికెటర్ ఆఫ్‌ది ఇయర్ 2017 అవార్డును అశ్విన్ సొంత చేసుకున్నాడు. కిందటి సీజన్‌లో నిలకడైన బౌలింగ్‌తో భారత్‌కు పలు సిరీస్‌లను అందించిన అ శ్విన్‌కు ఈ ప్రతిష్టాత్మకమైన అవార్డు లభించింది. కిందటి సీజన్‌లో అసమాన ప్రతిభను కనబ రిచిన అశ్విన్ 99 వికెట్లను పడగొట్టి టీమిండియా విజయాల్లో కీలకపాత్ర పోషించాడు. దీంతో అతనికి ఈ అరుదైన అవార్డు దక్కింది. క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్, రైజింగ్ పుణె సపర్‌జె యింట్ చైర్మన్ హర్ష్‌గోయంకా చేతుల మీదుగా అశ్విన్ ఈ అవార్డు అందుకున్నాడు.
మెరుగ్గా రాణిస్తా: అశ్విన్
ప్రతిష్టాత్మకమైన అవార్డు రావడంపై అశ్విన్ ఆనందం వ్యక్తం చేశాడు. రానున్న రోజుల్లో మరింత మెరుగైన ప్రదర్శన ఇచ్చేందుకు ఈ పురస్కారం దోహదం చేస్తుందన్నాడు. కాగా, ఇంగ్లాండ్‌లో జరిగే ప్రతిష్టాత్మకమైన ఛాంపియన్స్ ట్రోఫీలో మెరుగ్గా రాణిస్తాననే నమ్మకాన్ని వ్యక్తం చేశాడు. గాయం వల్ల కొంతకాలంగా తాను ఆటకు దూరంగా ఉన్నానన్నాడు. తగినంత విశ్రాంతి లభించడంతో తాను సమరోత్సాహంతో ఉన్నానని తెలిపాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో జట్టుకు అండగా నిలువడమే తన ముందున్న ఏకైక లక్షమన్నాడు. విపరీత పోటీ ఈ ఉండే టోర్నీలో మెరుగైన బౌలింగ్‌తో జట్టుకు అండగా ఉంటానన్నాడు. ఇంగ్లాండ్ పిచ్‌లపై రాణిస్తాననే నమ్మకం తనకుందన్నాడు. పిచ్‌లు ఫాస్ట్ బౌలింగ్‌కు అనుకూలంగా ఉండే అవకాశాలున్నా తాను మాత్రం మెరుగ్గా ఆడేందుకు సర్వం ఒడ్డుతానని స్పష్టం చేశాడు. బ్యాట్‌తో పాటు బంతితో చెలరేగే ఆటగాళ్లు భారత్‌కు అందుబాటులో ఉన్నారని, దీంతో ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ మెరుగైన ప్రదర్శన ఇవ్వడం ఖాయమని అశ్విన్ జోస్యం చెప్పాడు.

Comments

comments