Search
Saturday 17 November 2018
  • :
  • :
Latest News

19 నెలల కనిష్టానికి బంగారం ధర

International weak signals have reduced gold prices

న్యూఢిల్లీ: బంగారం ధర 19 నెలల కనిష్టానికి చేరింది. గురువారం పది గ్రాముల పసిడి ధర 290 పడిపోయి రూ.30,340కు చేరుకుంది. దేశీయంగా నగల వ్యాపారుల నుంచి డిమాండ్ లేకపోవడం, అంతర్జాతీయ బలహీన సంకేతాలు బంగారం ధరను తగ్గించాయి. మరోవైపు వెండి కూడా రూ.715(కిలో) రూ.38,000లకు చేరింది. పారిశ్రామిక సంస్థలు, నాణేల తయారీదారుల నుంచి బలహీన డిమాండ్ కారణంగా వెండి ధర కూడా పతనమైంది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్(31.1 గ్రాములు) పసిడి ఫ్యూచర్స్‌లో 6.5 డాలర్లు తగ్గి 1179 డాలర్లకు చేరింది. ఇంట్రాడేలో 1173 డాలర్లను తాకింది. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర 2017 జనవరి స్థాయికి చేరింది. అయితే డాలరుతో మారకంలో రూపాయి 70 స్థాయికి బలహీనపడటంతో అంతర్జాతీయ మార్కెట్లో ధరలు తగ్గినప్పటికీ ఆ ప్రభావం దేశీయంగా కనిపించడంలేదని బులియన్ వర్గాలు చెబుతున్నాయి.   ఆరు ప్రధాన కరెన్సీలతో మారకంలో డాలరు తాజాగా 13 నెలల గరిష్టం 96.75కు చేరింది.

Comments

comments