Home జిల్లాలు ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం

ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం

yogiమన తెలంగాణ/కలెక్టరేట్ : రెండవ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని స్ధానిక నాగార్జున ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో ఎన్‌సిసి 31 తెలంగాణ బెటాలియన్ కమాండింగ్ ఆఫీసర్స్ లెఫ్టినెంట్ కల్నల్ సునీల్ చంద్రసింగ్, ఎన్‌సిసి నల్లగొండ ఆఫీసర్ విఘ్నేశ్వర్ ఆధ్వర్యంలో ఎన్‌సిసి అభ్యర్ధులచే యోగాసనం చేయించారు. ఈ యోగా వలన మానసిక ప్రశాంతత, ప్రతినిత్యం ఎన్నో సమస్యలతోని ఉదయం నుంచి రాత్రి వరకు ఎదుర్కొంటున్న సమస్యలకు జీవితంలో ప్రతి మనిషి రోజు యోగా చేయడం వలన మానసిక వికాసం కలుగుతుందని కమాండింగ్ ఆపీసర్స్ అన్నారు. జిల్లాలోని భువనగిరి, సూర్యాపేట, వలిగొండ, మిర్యాలగూడ, నాగార్జునసాగర్ కేంద్రాలలో 2వేల మంది ఎన్‌సిసి అభ్యర్ధులు యోగాసనం నిర్వహించినట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిలానీ, విక్రమ్, న్యూజిమా, ఎస్‌బి.సింగ్, సునిల్, సగాయిరాజ్, నేత్ర తదితరులు ఉన్నారు.
సూర్యాపేటలో..
మన తెలంగాణ/సూర్యాపేటః ప్రపంచ యోగా దినోత్సవాన్ని పట్టణ ప్రజలు ఉత్సాహంగా జరుపుకున్నారు. మంగళవారం ఉదయం 5 గంటల నుండే యోగా దినోత్సవ సందడి నెలకొంది. పట్టణంలోని పాత వ్యవసాయ మార్కెట్ యార్డు, చర్చి కాంపౌండ్‌లోని పతంజలి యోగా శిక్షణ కేంద్రంలో యోగా కార్యక్రమం నిర్వహించారు. మార్కెట్ యార్డులో జరిగిన అంతర్జాతీయ యోగా కార్యక్రమానికి విచ్చేసిన మున్సిపల్ చైర్‌పర్సన్ గండూరి ప్రవళిక మాట్లాడుతూ అశాంతి, అసంతృప్తి నుండి బయట పడటానికి ప్రతి ఒక్కరూ యోగా దృష్టి సారించాలని సూచించారు. శ్వాసపై ధ్యాస ఉంచి మనస్సును శాంతపరిచేలా యోగా ఉపకరిస్తుందని చెప్పారు. భారతదేశంలో ఆవిర్భవించిన యోగా విశ్వవ్యాప్తమైందని వివరించారు. మారిన కాలం, అంతా ఉరుకుల పరుగుల జీవనం, క్షణం తీరికదొరకని పరిస్థితి, అంతా టెన్షన్ నిండివున్న ప్రస్తుత పరిస్థితుల నుండి ప్రశాంతత వైపు మనస్సును మళ్లించే ఏకైక సాధనం యోగాసనాలని తెలిపారు. శారీరక, మానసిక వికాసానికి యోగా అత్యుత్తుమైనదని వెల్లడించారు. సంతోషాన్ని, శాంతిని పొందడానికి యోగాను మించిన సాధనం లేదని స్పష్టం చేశారు. ప్రజలు రకరకాల వత్తిడిలతో మానసిక, శారీరక అస్వస్థతకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఔషదాలు తాత్కాలిక ఉపశమనం ఇస్తాయని చెప్పారు. యోగా మాత్రమే మూలాల్లోకి వెళ్లి సమస్యను పరిష్కరిస్తుందని స్పష్టం చేశారు. అందుకే పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులకు యోగా తరగతులు నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఈ యోగా ఉత్సవాలను సూర్యాపేట ఉన్నత యోగా మండలి, భానుపురి ఉన్నత యోగా మండలి, సత్ నిరంకారి సత్సగం రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్, ఆర్ట్ ఆఫ్ లివింగ్, పతంజలి యోగా శిక్షణ కేంద్రం, నటరాజు డ్యాన్స్ అకాడమి, బ్రహ్మకుమారి ఈశ్వర్య విశ్వవిద్యాలయం, పిరమిడ్ స్పిరిట్ మ్యూచ్‌వల్ సంస్థలు నిర్వహించాయి. ముప్పారపు నాగేశ్వరరావు కన్వీనర్‌గా వ్యవహరించిన ఈ కార్యక్రమంలో యోగా గురువులు సిద్ధరాజ్ తపోవన్ గురూజి, చాడ పాపిరెడ్డి, తిరునగరు యాదగిరి, వెంకట్‌రెడ్డి, మాధవి అక్కయ్య, స్వర్ణకుమారి, మధుగురూజి, మానుపురి దయాసాగర్, దారం రాజు, శివప్రసాద్, నాయకులు గండూరి ప్రకాష్, బడుగుల లింగ య్య యాదవ్, వాసా శ్రీశైలం, దేవరశెట్టి వెంకటేశ్వర్లు, నాగేశ్వర రావు, పేరిణి వెంకట్‌గౌడ్, ముప్పారపు నరేందర్, రాచర్ల కమలాకర్, తల్లాడ వెంకటేశ్వర్లు, పలు పాఠశాల, కళాశాలల విద్యార్థులు పాల్గొన్నారు.
చౌటుప్పల్‌లో ….
మన తెలంగాణ/ చౌటుప్పల్ ః నిత్యం యోగా చేస్తే వ్యాధులన్నీ దూరమవడమే కాకుండా సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుందని మునుగోడు శాసనసభ్యుడు కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి పేర్కొన్నారు. చౌటుప్పల్‌లోని వ్యవసాయ మార్కెట్ యార్డులో మంగళవారం నిర్వహించిన అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఔత్సాహికులు, తెలంగాణ గురుకుల విద్యార్థులతో కలిసి ఎమ్మెల్యే చేసిన యోగాఆసనాలు వేశారు. గురుకుల పాఠశాల విద్యార్థులు వినూత్న రీతిలో చేసిన యోగా ఆసనాలు అందరినీ అలరించాయి. అనంతరం జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ యోగా చేస్తే సంపూర్ణ ఆరోగ్యవంతులవుతారని తెలిపారు. మానసిక ఒత్తిళ్లతో సతమతమయ్యే వారికి స్వస్థత చేకూర్చే ప్రక్రియ యోగా అన్నారు. నిత్యం యోగా చేస్తే ఉపశమనం పొందవచ్చాన్నారు. కార్యక్రమంలో జెడ్పిటిసి సభ్యుడు పెద్దిటి బుచ్చిరెడ్డి, స్థానిక సర్పంచి బొంగు లావణ్య, మండల పరిషత్ మాజీ ఉపాధ్యక్షుడు బొంగు జంగయ్యగౌడ్, ఎంఈవో బి. రాములు, గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ విద్యాసాగర్, ఊడుగు శ్రీనివాస్‌గౌడ్, వర్కాల రవిగౌడ్, వీరమల్ల సత్తయ్యగౌడ్, శ్రీరంగం మధు, డిల్లీ శంకర్‌రెడ్డి, మునుకుంట్ల సత్యనారాయణగౌడ్ తదితరులు పాల్గొన్నారు.