Home తాజా వార్తలు అంతరాష్ట్ర దొంగ అరెస్టు

అంతరాష్ట్ర దొంగ అరెస్టు

acb-arrested-in-bribe-image

వరంగల్ : ఎటిఎం కేంద్రాల్లో చోరీలకు పాల్పడుతున్న అంతరాష్ట్ర దొంగను వరంగల్ సిసిఎస్ పోలీసులు అరెస్టు చేశారు. తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఎటిఎం కేంద్రాలకు వచ్చే వృద్ధులు, అమాయకులను టార్గెట్‌గా చేసుకుని డబ్బులు డ్రా చేసే సమయంలో సహాయపడుతున్నట్టు నటించి డబ్బులు తీసుకుని పరారయ్యేవాడు. అరెస్టు అయిన నిందితుడి నుంచి రూ. 4 లక్షల 20 వేల నగదు, రూ. 40 వేల విలువ చేసే సెల్‌ఫోన్‌తో పాటు వివిధ బ్యాంకులకు చెందిన 27 డెబిట్ కార్డులను స్వాధీనం చేసుకున్నట్టు సిసిఎస్ పోలీసులు వెల్లడించారు.