హైదరాబాద్ : ఐదుగురు సభ్యులు గల అంతరాష్ట్ర దొంగల ముఠాను హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి 780 గ్రాముల బంగారు నగలతో ఆపటు కారు, చోరీలకు ఉపయోగించే వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. వీరు నల్లగొండ, సూర్యాపేట, మహబూబ్నగర్ జిల్లాల్లో చోరీలకు పాల్పడినట్టు పోలీసులు తెలిపారు. తమ ప్రాంతాల్లో అనుమానాస్పదస్థితిలో సంచరించే వ్యక్తుల సమాచారం ఇవ్వాలని పోలీసులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.