Search
Monday 19 November 2018
  • :
  • :
Latest News

అది వచ్చాకే డైరెక్షన్ చేస్తా

అడివిశేష్, శోభితా ధూళిపాళ హీరో హీరోయిన్‌లుగా శశి కిరణ్ తిక్క దర్శక త్వంలో తెరకెక్కిన చిత్రం ‘గూఢచారి’.  అభిషేక్ పిక్చర్స్, విస్తా డ్రీమ్  మర్చంట్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సమర్పణలో అభిషేక్ అగర్వాల్ నిర్మించిన చిత్రమిది. శుక్రవారం ఈ చిత్రం విడుదలకా నుంది. ఈ సంద ర్భంగా హీరో అడివిశే ష్‌తో ఇంటర్వూ… 

Adivi-Shesh

 నేటి ట్రెండ్‌కు తగ్గట్టు…

‘క్షణం’ విడుదలైన 20 రోజుల్లోపు ఈ సినిమాకు సంతకం చేశాను. అప్పుడెప్పుడో నేను రాసుకున్న కథ ఒకటి శశికిరణ్‌కు ఇచ్చాను. అతను నేటి తరానికి ఈ కథ పనికి రాదన్నారు. వెంటనే అందులోని థీమ్ తీసుకొని నేటి ట్రెండ్‌కు తగ్గట్టు ఈ కథను రాశాం. స్క్రీన్‌ప్లే విషయంలో శశితో పాటు రాహుల్ అనే వ్యక్తి సాయం చేశాడు. ‘క్షణం’ క్లైమాక్స్‌ను ఎడిట్ చేసింది కూడా రాహులే.
 చాలా రీసెర్చ్ చేశాం…
ఇది జేమ్స్‌బాండ్ తరహా సినిమా కాదు. కాకపోతే గచ్చిబౌలి ఐఎన్‌బిలో ఎంబిఎ చదివే ఓ కుర్రాడు…. సరదాగా కాఫీ షాప్‌లో అమ్మాయికి బీట్ వేసుకునే కుర్రాడు ‘రా’లోని త్రినేత్ర విభాగానికి ఎలా వెళ్లాడు అనే నేపథ్యంలో ఈ సినిమా ఉంటుంది. కథ కోసం చాలా రీసెర్చ్ చేశాం.
 టైటిల్ వాడుకున్నాం…
పాత ‘గూఢచారి’కి ఈ సినిమాకు ఏ సంబంధం ఉండదు. కాకపోతే కేవలం టైటిల్‌ను వాడుకున్నాం. అయితే ఇందులో ఓ పాత్ర చేయమని సూపర్‌స్టార్ కృష్ణను వెళ్లి కలిశాను. తాను ఇప్పుడు నటించడం లేదని… కావాలంటే తన పాత సినిమాలోని సీన్లను వాడుకోమని చెప్పారు. కేవలం టైటిల్ వాడుకుంటానని చెప్పాను.
 రెండు కలిపి చేయను…
ప్రస్తుతం నటనపైనే దృష్టి పెడుతున్నాను. యాక్టింగ్, డైరెక్షన్ కలిపి చేయను. దర్శకత్వానికి ఇంకాస్త మెచ్యూరిటీ కావాలి. అది వచ్చాక డైరెక్షన్ చేస్తా.
 నెక్స్ మూవీస్…
ప్రస్తుతం నేను రెండు సినిమాలు చేస్తున్నాను. అందులో ఒకటి ‘2 స్టేట్స్’ రీమేక్. మరొకటి పివిపి బ్యానర్‌లో చేస్తున్నాను. రామ్‌జీ అనే కొత్త దర్శకుడు ఈ సినిమా చేస్తున్నాడు. అలాగే మా అన్నయ్య సాయికిరణ్ అడివితో ఓ సినిమా అనుకున్నాం కానీ కుదరలేదు.

Comments

comments