Search
Wednesday 26 September 2018
  • :
  • :

హీరోయిన్‌ను రక్షించే బ్యాంక్ కలెక్షన్ ఏజెంట్

R1

పుష్యమి ఫిలిం మేకర్స్ బ్యానర్‌లపై విజయ్, కీర్తి సురేష్ హీరోహీరోయిన్లుగా జగపతిబాబు ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘ఏజెంట్ భైరవ’. భరతన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి బెల్లం రామకృష్ణారెడ్డి నిర్మాత. ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా నిర్మాత బెల్లం రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ “విజయ్, కీర్తి సురేష్ జంటగా నటించిన ‘ఏజెంట్ భైరవ’లో అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ఉంటాయి. ఇందులో హీరో విజయ్ ఓ బ్యాంక్‌లో కలెక్షన్ ఏజెంట్‌గా పనిచేస్తుంటాడు. ఓ పెళ్లిలో హీరోయిన్ కీర్తి సురేష్‌ను చూసి ప్రేమలో పడతాడు. కానీ కీర్తి ఓ ప్రమాదంలో ఉందని తెలుసుకున్న హీరో ఆమెకు ఎలా అండగా నిలబడ్డాడనేదే సినిమా కథ. ఈ సినిమాలో జగపతిబాబు పిడకల కోటయ్య అనే క్యారెక్టర్‌లో కనపడతాడు. మాంసం అమ్ముకునే పిడకల కోటయ్య ఉన్నట్లుండి పెద్ద బిజినెస్‌మేన్‌గా ఎలా మారాడు. కాలేజీలను ఎలా స్థాపించాడు. దానివల్ల హీరోయిన్‌కు వచ్చిన సమస్య ఏంటి? అనే విషయాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే. సంతోష్ నారాయణ్ సంగీతం, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకు చాలా పెద్ద ప్లస్ అవుతుంది. ఈ సినిమాను తమిళంలో విజయ బ్యానర్‌వారు నిర్మించారు. వారు తెలుగు ప్రేక్షకులు, మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకొని డైలాగ్స్, సీన్స్ డిజైన్ చేయడం వల్ల సినిమా మన తెలుగువారికి కూడా బాగా నచ్చుతుంది. ‘ఏజెంట్ భైరవ’ చిత్రాన్ని శుక్రవారం నాడు 235 థియేటర్లలో విడుదల చేస్తున్నాం. ఇక నేను దర్శకుడిగా చింతపల్లి రమణ రచనలో ఓ సినిమా చేయబోతున్నాను. ఫిమేల్ ఓరియెంటెడ్ మూవీ ఇది. కథకు తగ్గట్లు మంచి లీడింగ్ హీరోయిన్ ఈ సినిమాలో నడుస్తుంది. అలాగే నా బ్యానర్‌లో బెలూన్, స్వామి 2 సినిమాలను కూడా తెలుగు ప్రేక్షకులకు అందించబోతున్నాను. బెలూన్ చిత్రంలో రాజ్‌తరుణ్ కీలక పాత్రలో నటిస్తున్నారు ”అని అన్నారు.

Comments

comments