Home Default యాక్షన్ స్టోరీస్ ఎన్నయినా చేయవచ్చు

యాక్షన్ స్టోరీస్ ఎన్నయినా చేయవచ్చు

బెల్లంకొండ శ్రీనివాస్, కాజల్ అగర్వాల్, మెహరీన్ హీరోహీరోయిన్లుగా శ్రీనివాస్ మామిళ్ల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘కవచం’. వంశధార క్రియేషన్స్ బ్యానర్‌పై నవీన్ సొంటినేని ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం శుక్రవారం విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరో బెల్లంకొండ శ్రీనివాస్‌తో ఇంటర్వూ విశేషాలు…
స్పీడ్‌గా సాగుతూ…
‘కవచం’ సినిమాలో నేను తొలిసారి పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తున్నాను. అయితే ఆ పోలీస్ ఆఫీసర్‌ను ఓ కేసులో ట్రాప్ చేసి ఇరికిస్తారు. దాని నుంచి బయటపడి అతను కేసును ఎ లా పరిష్కరిస్తాడన్నదే ఈ చి త్రం. సినిమా స్పీడ్‌గా సాగుతూ ప్రేక్షకులను అలరిస్తుంది.
అనుభవమున్న దర్శకుడిలా…
దర్శకుడు శ్రీనివాస్ ఇంతకుముందు దృశ్యం, గోపాల గోపాల చిత్రాలకు కో డైరెక్టర్‌గా పనిచేశారు. ఆయన కథ చెప్పేటప్పుడు మంచి అనుభవమున్న దర్శకుడిలా అనిపించారు. ఈ కథలో మంచి ట్విస్టులు ఉంటాయి. తొలి 15 నిమిషాలు కథ సాధారణంగా ఉంటుంది. ఆతర్వాత ఆసక్తికరంగా సాగుతుంది. సినిమా చూస్తే కొత్త దర్శకుడు చేసినట్లు అనిపించదు.

ఎవరికి వవచంగా…

హీరోయిన్లు కాజల్ అగర్వాల్, మెహరీన్‌లు చక్కగా నటించారు. మెహరీన్ పాత్ర చాలా కీలకంగా ఉంటుంది. మరి పోలీస్ ఆఫీసర్ అయిన హీరో ఇద్దరు హీరోయిన్లలో ఎవరికి కవచంగా ఉండి రక్షిస్తాడో తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.

థ్రిల్లర్ ప్రధానంగా…
జయ జానకి నాయక, సాక్షం సినిమాల నుండి బాడీ బిల్డప్ చేస్తూ వచ్చాను. ఈ సినిమాకు కూడా అదే బాడీని మెయింటేన్ చేశాను. ఈ సినిమాలో యాక్షన్ ఉన్నా కూడా థ్రిల్లర్ ప్రధానంగా సాగుతుంది. ఆద్యంతం ఈ చిత్రం ప్రేక్షకులను అలరిస్తుంది. విమర్శకులు, ప్రేక్షకులకు నచ్చేలా సినిమా ఉంటుంది.
అమితాబ్ సినిమాలు చూశాను…
మంచి కథ కుదిరింది కాబట్టి పోలీస్ ఆఫీసర్‌గా నటించాను. ఈ సినిమాలో నా క్యారెక్టర్ పేరు విజయ్. పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ చేయడానికి ముందు అమితాబ్ బచ్చన్ సినిమాలు చాలా చూశాను. అమితాబ్ పోలీస్ ఆఫీసర్‌గా నటించిన కొన్ని సినిమాల్లో ఆయన పేరు విజయ్. కాబట్టి అదే సెంటిమెంట్‌తో ఈ సినిమాలో నా పాత్ర పేరును విజయ్ అని పెట్టారు.
ఎక్కువ స్కోప్ ఉంటుంది…
యాక్షన్ సినిమాలకు ఎక్కువ ఆదరణ ఉంటుందని నా అభిప్రాయం. లవ్‌స్టోరీస్ అంటే రెండు, మూడు చేయవచ్చు. పది లవ్ స్టోరీస్ చేయలేం. అదే యాక్షన్ స్టోరీస్ అనుకోండి. ఎన్నయినా చేయవచ్చు. చాలా జోనర్స్‌లో యాక్షన్ కథలున్నాయి. వీటిలో వేరియేషన్స్‌కు ఎక్కువ స్కోప్ ఉంటుంది.
తదుపరి చిత్రం…
ప్రస్తుతం చేస్తున్న తేజ సినిమాలో ఫస్టాఫ్‌లో పెద్దగా యాక్షన్ ఉండదు. రొమాంటిక్ కామెడీ ఉంటుంది. సెకండాఫ్‌లో యాక్షన్ ఉంటుంది. పూర్తిగా ఎంటర్‌టైనింగ్ మూవీ ఇది. పది రోజులు మినహా ఈ సినిమా చిత్రీకరణ పూర్తయింది.

Interview With Bellamkonda Srinivas About Kavacham 

Telangana News