Search
Wednesday 14 November 2018
  • :
  • :
Latest News

నేను ఎప్పుడు నిర్మాతలు, దర్శకుల హీరోనే

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, పూజా హెగ్డే జంటగా అభిషేక్ పిక్చర్స్ పతాకంపై అభిషేక్ నామా నిర్మించిన చిత్రం ‘సాక్షం’. ఈనెల 27న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరో సాయి శ్రీనివాస్‌తో ఇంటర్వూ విశేషాలు…

Bellamkonda-Srinivas

 పంచభూతాలతో స్క్రిప్ట్…
నేను చేసిన ‘జయ జానకి నాయక’ సినిమా విడుదల కాకముందే శ్రీవాస్ నాకు ఈ కథ చెప్పారు. పంచభూతాలతో ఇలా స్క్రిప్ట్ రాసిన దర్శకుడికి హ్యాట్సాఫ్ చెప్పాలి. ఆయన ఇంత గొప్ప స్క్రిప్ట్‌ని తెలుగు నేటివిటీకి తగ్గట్టు రాశారు. ఏదైతే కథ చెప్పారో అదేవిధంగా సినిమాను అద్భుతంగా తెరకెక్కించారు.
 ప్రపంచంలోనే కొత్తది…
పంచభూతాలతో చేసిన ఈ రకమైన స్క్రిప్ట్ కేవలం ఇండియాలోనే కాదు ప్రపంచంలోనే కొత్తది అని చెప్పవచ్చు. ఈ సినిమా తర్వాత ఈ కాన్సెప్ట్‌పై మరిన్ని సినిమాలు వస్తాయని అనుకుంటున్నాను.
 పక్కా కమర్షియల్ మూవీ…
సోషల్ మూవీ ఇది. పక్కా కమర్షియల్‌గా తెరకెక్కించడం జరిగింది. అలాగే చెప్పాలనుకున్న పాయింట్‌ని పక్కదారి పట్టించకుండా దర్శకుడు చాలా కష్టపడి ఈ సినిమా తీశారు. ఇందులో గ్రాఫిక్స్ కూడా ఉంటాయి. ఎక్కువగా రియలిస్టిక్ సీన్లు తీయడం జరిగింది.
 అద్భుతంగా నటించారు…
మొత్తం నలుగురు విలన్లు ఈ సినిమాకు పనిచేశారు. జగపతిబాబు, రవికిషన్, అశుతోష్ రానా, మధుగురుస్వామి ప్రతినాయకులుగా నటించారు. ఇక శరత్‌కుమార్, మీనా పాత్రలు కూడా అందరికీ నచ్చుతాయి. నటీనటులు అందరూ అద్భుతంగా నటించారు.
 ఆయన నుండి ఎంతో నేర్చుకోవచ్చు…
దర్శకుడు శ్రీవాస్ ఏడేళ్ల ముందే ఈ కథను సిద్ధం చేశారు. ఆయన నుండి ఎంతో నేర్చుకోవచ్చు. ఈ సినిమా చేసేటప్పుడు ఒక పెద్ద దర్శకుడితో పనిచేసిన ఫీలింగ్ నాకు కలిగింది.
 నిర్మాణంలో రాజీపడలేదు…
నేను ఎప్పుడు నిర్మాతలు, దర్శకుల హీరోనే. సినిమా నిర్మాణంలో జాగ్రత్తగా ఖర్చు పెట్టండి అని నేను ఎప్పుడూ చెబుతుంటాను. నిర్మాత అభిషేక్ సినిమా నిర్మాణంలో ఏమాత్రం రాజీపడలేదు.

Comments

comments