Search
Thursday 15 November 2018
  • :
  • :
Latest News

కాజోల్‌ను ఎలా ఎదుర్కొన్నాననేదే కొత్త పాయింట్

Danush

ధనుష్ హీరోగా వి క్రియేషన్స్, వండర్ బార్స్ పతాకాలపై రూపొందిన చిత్రం ‘విఐపి 2’. తెలుగులో పెద్ద హిట్టయిన ‘రఘువరన్ బి.టెక్’ మూవీకి సీక్వెల్ ఇది. సౌందర్య రజనీకాంత్ దర్శకత్వంలో కలైపులి థాను, ధనుష్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం శుక్రవారం విడుదలకానుంది. ఈ సందర్భంగా ధనుష్ హైదరాబాద్‌లో విలేకరులతో ముచ్చటిస్తూ చెప్పిన విశేషాలు… 

తెలుగులో నా మొదటి సినిమా…
‘రఘువరన్ బి.టెక్’ హిట్టవ్వడంతో దీని సీక్వెల్ ‘విఐపి 2’ను తెలుగులో కూడా చేయడం జరిగింది. హీరోగా నాకు ఇదే మొదటి తెలుగు సినిమా. ఈ చిత్రం కూడా మంచి హిట్ అవుతుందన్న నమ్మకం నాకుంది.
కొన్ని కారణాల వల్ల ఆలస్యం…
ముందుగా తమిళ్, తెలుగులో ఒకేసారి ఈ చిత్రాన్ని విడుదల చేయాలని అనుకున్నాం. కానీ కొన్ని కారణాల వల్ల తెలుగులో ఆలస్యమైంది. ఇక తమిళంలో ఆగస్టు 11 దాటితే మంచి రిలీజ్ డేట్ లేదు. అందుకే అక్కడ ముందుగా విడుదల చేశాం. ఇక తెలుగులో శుక్రవారం ‘విఐపి 2’ను రిలీజ్ చేస్తున్నాం.
కొత్త అనుభూతిని కలిగించే…
ఈ సినిమాలో హీరో క్యారెక్టర్, సెంటిమెంట్స్, కామెడీ, మాస్ ఎలిమెంట్స్ అన్నీ ‘రఘువరన్ బి.టెక్’లో ఉన్నట్టే ఉంటాయి. కాజోల్ పాత్రను నేను ఎలా ఎదుర్కొన్నాను అనేదే ఇందులో కొత్తగా కనిపించే పాయింట్. ప్రేక్షకులకు కొత్త అనుభూతిని కలిగించే సినిమా ఇది.
అందుకే సౌందర్య దర్శకురాలిగా…
నేను ఈ స్క్రిప్ట్ రాయగానే సినిమాను ఎలా ప్రారంభించాలి అనే దానిపై అస్సలు క్లారిటీ లేదు. అదే సమయంలో ఈ చిత్ర నిర్మాత కలైపులి థాను నాతో మాట్లాడుతూ… నేను ఒక సినిమా చేయాలని అనుకుంటున్నాను… సౌందర్య ఆలోచనలు కూడా గ్రాండ్‌గానే ఉంటాయని అన్నారు. దీంతో ఈ సినిమాకు ఆమె దర్శకురాలైతే బాగుంటుందని అనుకున్నాం.
కాజోల్ పాత్ర ప్రత్యేకంగా…
ఈ సినిమా కోసం కాజోల్ తమిళ్‌తో పాటు తెలుగులో నటించడానికి కూడా ఆసక్తి చూపారు. ఆమెకు ఈ సినిమా కథ నచ్చి ఇందులో నటించారు. కాజోల్ పాత్ర ఎంతో ప్రత్యేకంగా ఉంటుంది. ఆమె నటన ప్రేక్షకులకు ఎంతగానో నచ్చుతుంది. ఇక తమిళ్, తెలుగు భాషల్లో ఈ సినిమా షూటింగ్‌కు 52 రోజులు పట్టింది.
పనిచేయడమే నాకు రిలాక్సేషన్…
సౌత్‌తో పాటు బాలీవుడ్, హాలీవుడ్ సినిమాల్లో చేయడం ఎంతో ఆనందంగా ఉంది. అయితే బాలీవుడ్ నుండి పర్ఫెక్షన్ ఎలా ఉంటుందో నేర్చుకున్నాను. ఇక పనిచేయడమే నాకు రిలాక్సేషన్. ఎప్పుడూ పని చేస్తూనే ఉంటాను. చేసే పనిని ఎంజాయ్ చేయాలని అనుకుంటాను.

Comments

comments