Search
Sunday 23 September 2018
  • :
  • :
Latest News

నా కొడుకును నిలబెట్టావన్నారు

srinivas

శ్రీవాస్ దర్శకత్వంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, పూజా హెగ్డే జంటగా నటించిన చిత్రం ‘సాక్షం’. అభిషేక్ పిక్చర్స్ పతాకంపై అభిషేక్ నామా నిర్మించిన చిత్రమిది. తాజాగా విడుదలైన ఈ చిత్రం హిట్ టాక్‌తో థియేటర్లలో ఆడుతోంది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు శ్రీవాస్‌తో ఇంటర్వూ విశేషాలు… 

అద్భుతమైన స్పందన…
సినిమాకు చాలా మంచి స్పందన వస్తోంది. సినిమా చూసిన ప్రేక్షకులకు కొత్తగా ఫీలయ్యామని చెబుతున్నారు. ఇందులోని ముఖ్యమైన సన్నివేశాలు, యాక్షన్ సన్నివేశాలకు అద్భుతమైన స్పందన వస్తోంది. సినిమా ఓపెనింగ్స్ కూడా బాగున్నాయి.
రిస్క్ చేసి నటించాడు…
హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ చాలా బాగా చేశాడు. సినిమాలోని ఇంట్రడక్షన్ సీన్, యాక్షన్ సీన్స్‌లో ఎంతో రిస్క్ చేసి నటించాడు. భవిష్యత్తులో అతను పెద్ద హీరో అవుతాడు.
బెస్ట్ కాంప్లిమెంట్ అదే…
సాయి శ్రీనివాస్ తల్లి దగ్గర నుంచి నేను బెస్ట్ కాంప్లిమెంట్ అందుకున్నాను. ఆవిడ సినిమా చూసి ఎమోషనల్ అయిపోయి నా కొడుకును నిలబెట్టావు అని అన్నారు. వాళ్ల ఫ్యామిలీ మొత్తం హ్యాపీగా ఉంది.
కొత్త థీమ్‌తో…
ఓ కొత్త కాన్సెప్ట్‌తో సినిమా చేయాలనేది నా కోరిక. ఆ ఉద్దేశంలో ఉన్నప్పుడే ఈ మూవీకి సంబంధించిన థీమ్ నాకు ఫస్ట్ ఐడియాలా వచ్చింది. అసలు ఈ పాయింట్‌తో సినిమా రాలేదు అనుకున్న తర్వాత కథ మీద వర్క్ చేశాను.
నిజమైన రచయితగా కనిపించే…
సినిమాలోని వాల్మీకి పాత్రలో రెగ్యులర్ ఆర్టిస్టు కాకుండా నిజమైన రచయితగా కనిపించే నటుడు కావాలని అనుకున్నాము. అనంత్ శ్రీరామ్‌ను చూసిన తర్వాత అతను ఈ పాత్ర చేస్తే బాగుంటుందనిపించింది. చివరికి అతన్నే ఈ పాత్ర కోసం తీసుకున్నాము.
చాలా మంచి డైలాగ్స్…
బుర్రా సాయి మాధవ్ డైలాగ్స్ ఈ సినిమాకు చాలా బాగా హెల్ప్ అయ్యాయి. ఆయన చాలా మంచి డైలాగ్స్ రాశాడు. మేం అనుకున్న సబ్జెక్ట్ ప్రకారం ఆయన చాలా సింపుల్‌గా డైలాగ్స్ రాయడం జరిగింది.
నెక్స్ మూవీ…
ఎప్పుడు ఒకే తరహా సినిమాలు చేయడం నాకు ఇష్టం ఉండదు. ప్రస్తుతం నా దగ్గర ఓ డిఫరెంట్ స్టోరీ ఉంది. అస్సలు ఫైట్స్‌లేని ఓ డిఫరెంట్ పాయింట్‌తో కూడిన కథ ఇది. దాన్ని ఖచ్చితంగా సినిమాగా చేస్తా. కానీ పరిస్థితులను బట్టి, హీరోల డేట్లను బట్టే నా తర్వాత సినిమా ఉంటుంది.

Comments

comments