Search
Saturday 17 November 2018
  • :
  • :

త్రిష అంటే చాలా ఇష్టం

నితిన్ హీరోగా 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రై. లిమిటెడ్ పతాకంపై హను రాఘవపూడి దర్శకత్వంలో రామ్ ఆచంట, గోపీ ఆచంట, అనీల్ సుంకర నిర్మించిన  భారీ చిత్రం ‘లై’. ఈ చిత్రం ద్వారా హీరోయిన్‌గా మేఘా ఆకాష్ తెలుగు ప్రేక్షకులకు పరిచయమవుతోంది. ఈ చిత్రం ఈనెల 11న రిలీజ్‌కానుంది. ఈ సందర్భంగా మేఘా ఆకాష్‌తో ఇంటర్వూ విశేషాలు..

Meghan

చెన్నైలో పెరిగాను…
మా నాన్న ఆకాష్‌రాజా తెలుగు వారు కాగా అమ్మ బిందు రాజా మలయాళీ. చెన్నైలో పెరిగిన నేను అక్కడే విజువల్ కమ్యునికేషన్స్‌లో డిగ్రీ పూర్తిచేశాను. చిన్నప్పటి నుంచి నాకు సినిమాలంటే ఎంతో ఇష్టం.
గౌతమ్‌మీనన్ సినిమా చేస్తుండగా…
గౌతమ్ మీనన్ దర్శకత్వంలో సినిమా షూటింగ్ జరుగుతుండగా ఈ స్క్రిప్ట్ నా దగ్గరకు వచ్చింది. కథ వినగానే నచ్చి ఈ సినిమాకు ఒప్పుకున్నాను. అయితే తమిళంలో ప్రస్తుతం రెండు సినిమాలు చేస్తున్నాను. వాటిలో గౌతమ్ మీనన్, ధనుష్‌ల సినిమా ఒకటి. అలాగే బాలాజీ డైరెక్షన్‌లో మరో సినిమా చేస్తున్నాను. అవి రెండు చివరి దశల్లో ఉన్నాయి.
‘లై’ చిత్రమే ముందుగా...
నా తమిళ సినిమాలకంటే ముందుగా ‘లై’ చిత్రం ముందుగా రిలీజవుతుంది. ఒక తెలుగు సినిమా నా మొదటి సినిమా కావడం చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమా ఖచ్చితంగా విజయం సాధిస్తుందన్న నమ్మకముంది.
ఎనర్జిటిక్ క్యారెక్టర్…
సినిమాలో నా క్యారెక్టర్ పేరు చైత్ర. చాలా ఎనర్జిటిక్‌గా ఉంటుంది. ఎప్పుడు హుషారుగా మాట్లాడుతుండే క్యారెక్టర్ నాది. నిజానికి రియల్ లైఫ్‌లో నేను అలా ఉండను. నా క్యారెక్టర్ కేవలం పాటల కోసం మాత్రమే కాదు. నాకు కూడా కథలో ప్రాధాన్యత ఉంటుంది.
ఎంతో ఆనందంగా ఉంది…
నితిన్‌తో కలిసి పనిచేయడం ఎంతో ఆనందంగా ఉంది. అతను నాకు అర్థం కాని విషయాల్ని చాలా ఓపికగా వివరించేవాడు. ఇలా చేస్తే బాగుంటుంది అని సలహాలు ఇచ్చేవాడు. అతను సెట్స్‌లో డౌట్ టు ఎర్త్‌గా ఉంటాడు. కష్టపడి పనిచేస్తాడు. ఎప్పుడూ సరదాగా మాట్లాడుతుంటాడు.
ఆయన వర్క్ డిఫరెంట్‌గా…
హను రాఘవపూడి మంచి డైరెక్టర్. ఆయన వర్క్ చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. నా నుంచి మంచి నటనను రాబట్టుకున్నారు. ఆయన వల్లే ఎంతో ఆత్మ విశ్వాసంగా ఈ సినిమాను చేయగలిగాను.
అద్భుతంగా తెరకెక్కింది…
‘లై’ కోసం 75 రోజుల పాటు యుఎస్‌లోని లాస్‌వెగాస్, శాన్ ఫ్రాన్సిస్కో, చికాగో వంటి ప్రాంతాల్లో షూటింగ్ చేశాం. ఎంతో కష్టమైన షెడ్యూల్ ఇది. అయినా మంచి టీమ్ అవడం వల్ల సినిమా అద్భుతంగా తెరకెక్కింది.
అలియాభట్ నటన నచ్చుతుంది…
నాకు త్రిష అంటే చాలా ఇష్టం. బాలీవుడ్‌లో అలియాభట్ నటన నచ్చుతుంది. ఎందుకంటే చిన్న వయసులోనే ఎన్నో విభిన్నమైన పాత్రలు తను చేస్తోంది కాబట్టి. ఇక హీరోల విషయానికొస్తే తెలుగులో పవన్‌కళ్యాణ్ అంటే ఇష్టం.
నెక్స్ మూవీ…
పవన్-నితిన్ సినిమాలో హీరోయిన్‌గా చేసేందుకు ఓకే అన్నాను. ఈ సినిమా స్క్రిప్ట్ నాకెంతగానో నచ్చింది. అయితే గౌతమ్ మీనన్ సినిమాతో బిజీగా ఉండడం వల్ల రామ్ సినిమాను వదులుకోవాల్సి వచ్చింది.

Comments

comments