Search
Tuesday 13 November 2018
  • :
  • :
Latest News

రాంచరణ్‌తో సినిమా చేయాలనుంది

నాగచైతన్య, మంజిమ మోహన్ జంటగా గౌత మ్‌వా సుదేవ మీనన్ దర్శ కత్వంలో రూపొందుతున్న విభిన్న కథా చిత్రం ‘సాహసం శ్వాసగా సాగిపో’. మిర్యాల సత్య నారాయణరెడ్డి సమర్పణలో ద్వారకా క్రియేషన్స్ బ్యానర్‌పై మిర్యాల రవీందర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు ఈ సినిమాను ఈనెల 11న విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డితో ఇంటర్వూ విశేషాలు…

raviరెహమాన్ మ్యూజిక్‌కు అద్భుత స్పందన… దర్శకుడు గౌతమ్‌మీనన్ స్టయిల్లో ‘సాహసం శ్వాసగా సాగిపో’ చిత్రం చాలా బాగా వచ్చింది. రెహమాన్ మ్యూజిక్‌కు అద్భుతమైన స్పందన వస్తోంది. పాటలన్నీ మ్యూజికల్ హిట్‌గా నిలిచాయి. ఆడియో పెద్ద హిట్ అయింది. సినిమా కూడా పెద్ద హిట్ అవుతుందన్న నమ్మకముంది. కొన్ని సాంకేతిక కారణాల వల్ల సినిమా ఆలస్యమైంది. ప్రేక్షకులకు పూర్తి వినోదాన్నిచ్చే విధంగా ఈ ఎంటర్‌టైనర్ మూవీ రూపుదిద్దుకుంది.
బ్యూటిఫుల్ లవ్ స్టోరీ…
సినిమా ఫస్టాఫ్ అంతా బ్యూటిఫుల్ లవ్ స్టోరీ. సెకండాఫ్ యాక్షన్ పార్ట్‌తో థ్రిల్లింగ్‌గా ఉంటుంది. హీరోహీరోయిన్‌ల మధ్య ప్రేమకు ఓ సమస్య వస్తుంది. ఆ సమస్య కోసం హీరో ఎలాంటి సాహసం చేశాడనేదే మా సినిమా. నాగ చైతన్య ‘ప్రేమమ్’ హిట్ తర్వాత ‘సాహసం శ్వాసగా సాగి పో’ విడుదల వుతుం డడం చాలా మంచిద యింది.
ఆవిధంగా నిర్మాతనయ్యా…
దర్శకుడు శ్రీవాస్‌తో నాకు మంచి పరిచయం ఉంది. ఆయ నను తరచుగా కలిసేవాడిని. ‘డిక్టేట ర్’ సినిమా షూటింగ్ లొకేషన్‌లో ఓసారి శ్రీవాస్‌ను కలిశాను. ఆ సమయంలో అక్కడ ఉన్న కోన వెంకట్‌తో నాకు పరిచయం ఏర్పడింది. అప్పుడు ఆయన గౌతమ్ మీనన్ దర్శక త్వంలో నాగచైతన్య హీరోగా రెహమాన్ మ్యూజిక్ డైరెక్షన్‌లో రానున్న ‘సాహసం శ్వాసగా సాగిపో’ సినిమా గురించి చెప్పారు. దాంతో నేను నిర్మాతగా ఈ సినిమాలో ఓ భాగమయ్యాను.
అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి నిర్మాతగా…
మా కుటుంబ సభ్యులంతా వ్యాపారాల్లో స్థిరపడ్డవారే. నాకు సినిమాలంటే ఎంతో ఇష్టం. దాంతో దర్శకుడి కావాలనే ఉద్దేశంతో ఇండస్ట్రీలోకి వచ్చి కొంతకాలం అసిస్టెంట్ డైరెక్టర్‌గా కూడా పనిచేశాను. ఆతర్వాత నిర్మాతగా మారాను.
నెక్స్ మూవీస్… నాకు రాంచరణ్‌తో సినిమా చేయాలనే కోరిక ఉంది. ఆయన అవకాశం ఇస్తే తప్పకుండా ఓ పెద్ద సినిమా చేస్తాను. ఇక బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో నిర్మిస్తున్న సినిమా ఈనెల 16 నుండి రెగ్యులర్ చిత్రీకరణ జరుపుకుంటుంది. అలాగే ఫిబ్రవరిలో గోపీచంద్ తో సినిమా ఉంటుంది. విజయ్ ఆంటోని నటించిన ‘యెమన్’ సినిమాను తెలుగులో విడుదల చేయబో తున్నాం. అలాగే మరో తమిళ సినిమా రీమేక్ హక్కులు కూడా తీసుకున్నాం. ఈ సినిమాను రీమేక్ చేయాలా లేదా అను వాదం చేయాలా అని ఆలోచిస్తున్నాం.

Comments

comments