Friday, April 19, 2024

నాని సూపర్ అన్నారు… బన్నీ క్లాసిక్ అన్నారు

- Advertisement -
- Advertisement -

Dil Raju

 

శర్వానంద్-, సమంత జంటగా సి.ప్రేమ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘జాను’. దిల్ రాజు నిర్మాతగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై ఎమోషనల్ లవ్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ మూవీ ఈనెల 7న గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్మాత దిల్ రాజుతో ఇంటర్వూ విశేషాలు…

మూడు రీమేక్‌లు…
నిర్మాతగా మా ప్రధాన ధ్యేయం ఓ మంచి సినిమాను ప్రేక్షకులకు అందించడం. అది ఏ భాషలో వచ్చినా తెలుగు ప్రేక్షకులకు అందించే ప్రయత్నం చేస్తాను. ఈ ఏడాది అనుకోకుండా హిందీ మూవీ ‘పింక్’ని, ‘96’ తమిళ మూవీని ‘జాను’గా తెలుగులో, తెలుగు ‘జెర్సీ’ని హిందీలో రీమేక్ చేస్తున్నాం. ఇలా మొత్తం మూడు రీమేక్ సినిమాలు చేస్తున్నాం.

చూసిన వెంటనే అడిగా…
‘96’ మూవీ విడుదలకు ముందే నిర్మాతతో కలిసి సినిమా చూశాను. సినిమా చూసిన వెంటనే నాకు తెలుగు రీమేక్ హక్కులు కావాలని అడిగాను. ఆయన అడిగిన మొత్తానికి 10 లక్షలు తక్కువ ఇచ్చాను. హిట్ అయితే మరో పాతిక లక్షలు ఇస్తానని అన్నాను. అన్న ప్రకారం తగ్గించిన 10 లక్షలకు మరో15 లక్షలు కలిపి మొత్తం 25 లక్షలు ఇచ్చాను.

ఆ పాత్రలకు కనెక్ట్ అయ్యా…
నాకు పూర్తిగా తమిళ్ రాదు. అయినప్పటికీ ఆ కథలో ఉన్న సహజత్వం నాకు నచ్చింది. భాష రాకపోయినా ఆ రెండు పాత్రలకు నేను కనెక్ట్ అయ్యాను. అందుకే ‘96’ రీమేక్ చేయాలని నిర్ణయించుకున్నాను.

సూపర్, క్లాసిక్ అన్నారు…
‘96’ మూవీ విడుదలకు ముందే హీరో నానికి… అలాగే బన్నీకి చూపించాను. నాని సూపర్ అన్నారు… బన్నీ క్లాసిక్ అన్నారు. విడుదల తరువాత చెన్నైలో సింగిల్ స్క్రీన్ ప్రేక్షకులతో పాటు, మల్టీ ప్లెక్స్ థియేటర్ లో కూడా నేను చూశాను. అన్ని వర్గాల ప్రేక్షకులకు ‘96’ బాగా నచ్చింది.

ఇక్కడి నేటివిటీకి తగ్గట్టుగా…
ఒరిజినల్ వర్షన్ కథలోని అసలు ఫ్లేవర్ మార్చలేదు. కాకపోతే ఇక్కడి నేటివిటీకి తగ్గట్టుగా కొన్ని మార్పులు చేయడం జరిగింది. ప్రేమ్ ఈ మేరకు సినిమాను అద్భుతంగా తెరకెక్కించారు.

ఆమె భయపడింది…
ఈ సినిమా చేయడానికి సమంత మొదట్లో ఒప్పుకోలేదు. ‘త్రిష బాగా చేశారు… ఆమెతో నన్ను పోలుస్తారు’ అని భయపడింది. నేను పట్టుబట్టి ఆమెను ఒప్పించాను. ఇక శర్వా ఒక రోజు వ్యవధిలోనే ‘మంచి సినిమా చేస్తాను’ అని ఓకే చెప్పారు. సమంత, శర్వా నటనతో దర్శకుడు ప్రేమ్ ఫుల్ హ్యాపీగా ఫీల్ అయ్యారు.

‘జాను’ టైటిల్ ఇచ్చారు…
ఈ చిత్రానికి ఓ మంచి సోల్‌ఫుల్ టైటిల్ పెట్టాలని అనుకున్నాను. అందుకే ‘జాను’ పెట్టాలని నిర్ణయించుకున్నాము. అప్పటికే ప్రభాస్ మూవీకి ఇది వర్కింగ్ టైటిల్‌గా ఉందని తెలిసి నిర్మాత వంశీకి ఫోన్ చేస్తే ‘మా సినిమా విడుదలకు చాలా సమయం ఉంది’ అని ‘జాను’ టైటిల్‌ను మాకిచ్చారు.

Interview with producer Dil Raju
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News