Home లైఫ్ స్టైల్ వకృత భావజాలన్ని విడనాడాలి..

వకృత భావజాలన్ని విడనాడాలి..

ఉన్నత కుటుంబంలో పుట్టి అన్ని వసతులు, అవకాశాలు ఉన్నా  అవేవీ తనకు సంతృప్తి నివ్వలేదంటూ,  వ్యక్తిగత జీవితాన్ని వదిలి సమాజానికి మంచి చేయాలనుకుంది.  మహిళలు, చినపిల్లల మీదా జరుగుతున్న హత్యాచారాలు, సమాజంలో ఉన్న సమస్యలపై పోరాటం సాగిస్తోంది. కుటుంబం ప్రజాస్వామికంగా లేదని, ఆడ పిల్లలను అదుపులో పెట్టి తొందరగా పెళ్లి చేసి పంపిస్తున్నారనీ, పితృస్వామ్య భావజాలం నడుస్తోందంటూ.. ప్రజాస్వామికంగా గొంతు విప్పి, మేథోపరమైన ఆలోచనలు అందిస్తున్న వారిలో రిటైర్డ్  ప్రొ॥ “పద్మజ షా” ఒకరు. సామాజిక కార్యకర్తగా తన కృషిని కొనసాగిస్తూనే, మరో వైపు ఎందరో విద్యార్థులను తెలుగు జర్నలిజంలో ప్రావీణ్యుల్ని చేసిన అధ్యాపకురాలు పద్మజషా తో ‘సకుటుంబం’ ముచ్చటిస్తూ….

lf

మీ బాల్యం …చదువు ఎలా కొనసాగింది..?
ఇంట్లో అమ్మనాన్నలు చదువుకున్న వారై ఉ-ండటంతో పుస్తకాలు బోలెడుండేవి, చదవడానికి చాలా రకాల లిటరేచర్ అందుబాటులో -ఉండేది. అలా నా బాల్యంలో అన్ని రకాల సాహిత్యం చదవటం ఒక అలవాటుగా వచ్చి చేరింది. చదవటం ఒక పిచ్చిగా -ఉండేది. అలా కొన్ని భాషలు కూడా నేర్చుకున్నా. టాల్‌స్టాయ్, గోర్కి , చెకోవ్, డెస్టొవేస్కి ఇలా ఎంతోమంది రచనలు నాకు సామాజిక స్పృహను కలిగించాయి. జీవితం వ్యక్తిగతం కాక సాముహికమైందనే అవగాహనను పెంపొందింది. అలా సమాజం వైపు ఆలోచించడానికి పుస్తకాలు నాకు ప్రేరణనిచాయి. స్కూల్ ఎడ్యుకేషన్ ఇంగ్లీషు మాధ్యమంలోనే కొనసాగుతూ వచ్చింది. బిఎ ఇంగ్లీషు, సైకాలజి,- ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎంసిజె పూర్తి చేశాను. ఆ కాలంలోనే టెలివిజన్ కొత్తగా వచ్చింది. టెలివిజన్‌లో చేరడానికి ట్రైనింగ్ కోసం అమెరికాలో ఎం.ఎ ప్రొడక్షన్ చదివాను. 1977 లో టెలివిజన్‌తో పాటు ఫొటోగ్రఫి కూడ నేర్చుకున్నాను..
ఉస్మానియాలో సామాజిక సమస్యల మీద మీ ప్రస్థానం ?
అమెరికా నుంచి తిరిగొచ్చాక ఉ-స్మానియాలో అధ్యాపకురాలిగా చేరాను. అప్పుడు తరగతి గదులు రాజకీయ చర్చలతో నిండి ఉ-ండేవి. యూనివర్సిటిలో ప్రజాస్వామిక వాతావరణం నెలకొని ఉ-ండేది. రైట్, లెఫ్ట్, సిద్ధాంతాల మీద వాడివేడి చర్చలు జరిగేవి. సామాజిక అంశాల పట్ల విద్యార్థి దశలోనే పత్రికలకు వ్యాసాలు రాయడం మొదలు పెట్టాను. ఎమర్జెన్సి కాలం నాటికి దేశంలో ప్రశ్నించే గొంతుకలపై అణిచివేత మొదలైంది. ఎమర్జెన్సి డిక్లేర్ చేసినపుడు పత్రికల ఆఫీసులకి వచ్చి ఏది రాయాలి, ఏది రాయకూడదు అని చేప్పేవారు. అలా కొన్ని వార్తలు బ్లాంక్‌గా వుంచేవారు. అంత నిర్భంధంలో కూడ మాట్లాడిన వారున్నారు. ఎమర్జెన్సీ తిప్పికొడుతూ పోరాడి ఆనాటి విద్యార్థులు మమ్మల్ని ఎంతో చైతన్యం చేశారు. ఆ ప్రభావం మమ్మల్ని సామాజిక -సమస్యల పరిష్కారాల వైపు నిలబెట్టగలిగింది.
మీరు అకడమిక్‌గా ఉన్న క్రమంలో వచ్చిన మార్పులు ఏమిటి?
అధ్యాపకురాలిగా అడుగేసిన తొలినాళ్లలో మీడియా కమర్షియల్‌గా లేదు. రాజకీయ పరిస్థితుల్లో కాలక్రమంలో మార్పులొచ్చాయి. 1990లోకి వచ్చాక అంటే ఎమర్జెన్సి తరువాత ముఖ్యంగా మీడియాలో పెద్దఎత్తున రెట్స్, మెన్స్ రైట్స్, ఆల్ కైండ్స్ ఆఫ్ రైట్స్ ఇలాంటివి చోటుచేసుకున్నాయి.
ప్రోగ్రెసివ్ పాలిటిక్స్‌కి చాలా స్థానం ఉ-ండేది. అప్పుడున్న స్థితిలో కావాలని మీడియాలో వక్రీకరణలు చేసే ధోరణి లేదు. కాని అప్పుడు కూడ బ్లెయివ్‌ు చేసేవాళ్లు.
1980 లో దేశంలో -మంచి సాహిత్యం తీసుకుని మంచి ప్రోగ్రావ్‌‌సు తయారు చేసేవాళ-్లం. ప్రేవ్‌ుచంద్ లాంటి వాళ్ల కథలు దూరదర్శన్‌లో వచ్చేవి.
మన కల్చర్‌లోంచి, మన సాహిత్యంలోంచి వచ్చిన విషయాలు తీసుకునేవారు. ఇప్పుడు మొత్తం ప్రైవేటైజ్ అయిపోయాయి. వివిధ రకాల వాయిస్ మార్కెట్లోకి వచ్చి చేరాయి. ఈ మధ్యకాలంలో టీవి లో వచ్చే కార్యక్రమాలు ఏ విధంగా సమాజానికి –
ఉపయోగపడుతాయనేది నా ప్రశ్న…

జర్నలిజంలో కొత్త, పాత తరాలకు అభిప్రాయ భేదాలు ఏమైనా వస్తున్నాయా..ఇప్పుడున్న మీడియా గురించి.. వందేళ్ల ఉస్మానియా యూనివర్సిటి జర్నలిజం డిపార్ట్‌మెంట్‌లో మార్పులు రావాల్సిన అవసరం ఉందంటారా.?
మా జనరేషన్‌లో మీడియా అంటే ఒక విలువలతో కూడినదిగా, సమాజం కోసం, సమస్యల కోసం గొంతెత్తుతుందని భావించిన వాళ్లం. అకడమిక్‌గా విద్యార్థులకి నైతిక విలువలు తప్పనిసరి అని బోధించేవాళ్లం. 1990లో ఫీడ్ బ్యాక్ ఇస్తూ మా స్టూడెంట్స్ వచ్చి మీరు చెప్పే విలువలేవీ సహజమైన ప్రపంచంలో కనిపించడం లేదని చెప్పేవారు. నాకు చాల బాధగా అనిపించేది. మీరు చెబుతున్నదొకటి బయట నడుస్తున్నది వేరు, మమ్మల్ని పక్కదారి పట్టిస్తున్నారా అని అడిగేవారు. జర్నలిస్టులకి ఉ-ండవలసిన లక్షణాలు, నైతిక విలువలు సమాజంలో పాత్ర ఒక థియరిటికల్ అండర్‌స్టాండింగ్‌తో ఒక బ్రాడ్ అండర్‌స్టాండింగ్‌తో పాలిటిక్స్ ఏమిటి? సమాజం ఏమిటి? సోషియాలజి ఏమిటి? సమాజంలో మన పాత్ర ఏంటి? అనే అవగాహన -వుండాలి. ఈ రోజుల్లో మీడియా ఎవరూ నమ్మని పరిస్థితికి వచ్చింది. నువ్వు నిలబడే ధైర్యం లేకుండా సరిగా, సమాజానికి మంచి చేయకుండా వ్యక్త్తిగత అవసరాల కోసం కాకుండా జర్నలిస్టులు ధైర్యంగా పనిచేయగలగాలి. 1954లో జర్నలిజం మొదలైంది. కొలంబియా యూనివర్సిటిలో మాదిరిగానే పరీక్షలు నిర్వహించేవారు. కాని ఇప్పుడు అలాంటి పద్ధతి పోయింది. కంప్యూటరైజ్డ్ పద్ధతులొచ్చాయి. నిక్షేపణ పరీక్షలతో విద్యార్థుల సామర్థ్యాన్ని ఎలా అంచనా వేయగలం? ఆసక్తి – ఉన్న వాళ్లు వస్తే మీడియాకి ప్రయోజనం -చేకూరుతుంది.
మహిళలపై ఏఏ రూపాల్లో హింస కొనసాగుతోంది?
మహిళకు అత్యంత ప్రమాదకరంగా మన దేశం ప్రపంచంలోనే మొదటి స్థానంలో -ఉండటం విషాదం. రోజురోజుకి నేరాల సంఖ్య పెరిగిపోతోంది. కుటుంబం ప్రజాస్వామికంగా లేదు. ఆడపిల్లలను అదుపులో పెట్టి తొందరగా పెళ్లి చేసి పంపించాలని చూస్తున్నారు. కుటుంబాల్లో అప్రజాస్వామిక వాతవరణం, పితృస్వామ్య భావజాలం నడుస్తుంది. చెల్లెలితో మాట్లాడితే తప్పుగా ఆలోచించే సమాజంలో ఉన్నాం మనం. వికృతమైన భావజాలంతో మగ్గుతున్నాం. ప్రచార సాధనాల ప్రభావం కొంత వరకుంటే, కుటుంబంలోనే ఎక్కువగా -ఈ ప్రభావం ఉంటోంది. కళ్లముందే నేరం జరుగుతుంటే విడియో తీసి పోస్టు చేసే స్థాయికి సమాజం చేరుకుంది.
చివరిగా మీరు జర్నలిస్టులకి ఇచ్చే సూచన…
తప్పుడు వార్తలు రాయకుండా ఉ-ండటం, డబ్బుకి అమ్ముడు పోకుండా, – ధైర్యంగా నిలబడి పనిచేయాలి. చరిత్ర రాసిన వాళ్లను ఎప్పుడూ సమాజం గుర్తుంచుకుంటుంది, మనకోసం మనం అనుకుంటే ఈ సమాజం మనల్ని గుర్తుంచుకోదు. సమాజం గురించి పనిచేయని వారు, సమాజం పట్ల బాధ్యత లేనివారు, వ్యవస్థ పట్ల గౌరవం లేనివారు పుట్టినా, పుట్టక
పోయిన ఒక్కటే…..

బొర్ర శ్రీనివాస్