Search
Wednesday 21 November 2018
  • :
  • :
Latest News

తన సక్సెస్ తర్వాతే నాకు అన్నీ

సమంత ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘యు టర్న్’. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్, వివై కంబైన్స్ బ్యానర్‌లపై శ్రీనివాస చిట్టూరి, రాంబాబు బండారు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రంలో ఆది పినిశెట్టి, రాహుల్ రవీంద్రన్, భూమిక కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రం గురువారం విడుదలకానుంది. ఈ సందర్భంగా సమంతతో ఇంటర్వూ విశేషాలు…
samantaఅక్కడ సక్సెస్ అయిన తర్వాత…
‘లూసియా’ సినిమా నుండి దర్శకుడు పవన్‌కుమార్ నాకు బాగా తెలుసు. మంచి స్క్రిప్ట్ ఉంటే నేను నటిస్తానని అతనితో ఓసారి చెప్పాను. కన్నడంలో ‘యు టర్న్’ సినిమాతో అతను మంచి విజయాన్ని అందుకున్నాడు. అక్కడ సినిమా సక్సెస్ అయిన తర్వాత తెలుగు, తమిళంలో ఈ సినిమా చేయడానికి సిద్ధమయ్యాను.
అందుకే సమయం పట్టింది…
ఈ సినిమా కోసం నా హెయిర్ స్టయిల్‌ను ఎంతో మార్చాల్సి వచ్చింది. దాంతో అంతకు ముందు ఉన్న సినిమాలను అన్నింటినీ పూర్తిచేసిన తర్వాత ‘యు టర్న్’ తెలుగు, తమిళం రీమేక్‌లో నటించడానికి సిద్ధమయ్యాను. అందుకే ఈ రీమేక్ కోసం కొంత సమయం పట్టింది. ఒరిజినల్ వర్షన్‌కు దగ్గరగానే ఉంటుంది ఈ చిత్రం. తెలుగులో చిన్న చిన్న మార్పులు మాత్రమే చేశాం. చివరి 20 నిమిషాల సినిమా ఉత్కంఠభరితంగా ఉంటుంది.
పరిపూర్ణ నటిని అనిపించుకోవాలని…
‘యు టర్న్’లో నా పాత్రకు నేనే డబ్బింగ్ చెప్పుకున్నాను. చిన్మయిని కాదని డబ్బింగ్ చెప్పడానికి ప్రత్యేకమైన కారణమేమీ లేదు. తమిళంలో నా పాత్రలకు నేనే డబ్బింగ్ చెప్పుకుంటున్నాను. తెలుగులో కూడా డబ్బింగ్ చెప్పుకొని ఓ పరిపూర్ణ నటిని అనిపించుకోవాలన్నదే నా ఉద్దేశ్యం.
ఎప్పటినుంచో అనుకున్నాం…
నాగచైతన్య సినిమా ‘శైలజారెడ్డి అల్లుడు’ను ముందుగా ఆగస్టు 31న విడుదల చేయాలని అనుకున్నారు. కానీ కొన్ని కారణాలతో కుదరలేదు. దీంతో వాళ్లు రెండు వారాల గ్యాప్ తీసుకొని గురువారం చైతన్య సినిమాను విడుదల చేయబోతున్నారు. అదే రోజున ‘యు టర్న్’ను విడుదల చేయాలని ఎప్పటినుంచో అనుకున్నాం. దీంతో చైతన్య, నేను పోటీ పడబోతున్నాం.
అతని సక్సెస్‌ను కోరుకుంటా…
మా రెండు సినిమాలు ఒకేసారి విడుదలవుతుంటే చిన్నపాటి టెన్షన్ ఉన్న మాట వాస్తవమే. అయితే ఎంతైనా నా భర్త చైతన్య సక్సెస్‌ను నేను కోరుకుంటాను. తన సక్సెస్ తర్వాతే నాకు అన్నీ.
అందుకు సమయం ఉంది…
ఒకప్పటితో పోల్చితే నాకు ఇప్పుడు బలం పెరిగింది. పెద్దింటి సపోర్ట్ దొరికింది. చైతన్య నాకు అండగా నిలబడుతున్నాడు. ఇక నేను సినిమాల్లో నటిస్తూ ఆ చిత్రాలను నిర్మించలేను. అయితే నేను సినిమాలకు నిర్మాతగా మారుతాను. కానీ అందుకు ఇంకా సమయం ఉంది. భవిష్యత్తులో మంచి కంటెంట్ ఉన్న సినిమాలను నిర్మిస్తాను.

Comments

comments