Home సినిమా ఎలా డీల్ చేశామనేదే ముఖ్యం

ఎలా డీల్ చేశామనేదే ముఖ్యం

శర్వానంద్, సాయిపల్లవి జంటగా నటించిన చిత్రం ‘పడి పడి లేచే మనసు’. హను రాఘవపూడి దర్శకత్వంలో చెరుకూరి సుధాకర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. శుక్రవారం ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా హీరో శర్వానంద్‌తో ఇంటర్వూ విశేషాలు…
ఆ బ్యాక్‌డ్రాప్‌లో అన్నీ హిట్…
కోల్‌కత్తా బ్యాక్‌డ్రాప్‌లో చూడాలని ఉంది, ఖుషి, లక్ష్మి సినిమాలు వచ్చాయి. అన్నీ హిట్ అయ్యాయి. ఈమధ్య కాలంలో కోల్‌కత్తా బ్యాక్‌డ్రాప్‌లో సినిమాలు రాలేదు. సెంటిమెంట్‌గా చూ  స్తే కూడా ఈ బ్యాక్‌డ్రాప్ సినిమాలు అన్నీ హిట్ అయ్యాయి. కోల్‌కత్తా బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన మా చిత్రం కూడా హిట్ అవుతుంది.
డిఫరెంట్ లవ్‌స్టోరీతో…
సాధారణంగా లవ్‌స్టోరీ అంటే ఇద్దరు ప్రేమికులు ఉంటారు. వారి మధ్య ప్రేమ ఎలా పుట్టింది? చివరికి ఏమైంది? అనేదే కాన్సెప్ట్‌గా ఉంటుంది. మా చిత్రం డిఫరెంట్ లవ్‌స్టోరీతో తెరకెక్కింది.
ఎలా డీల్ చేశామనేదే ముఖ్యం…
‘పడి పడి లేచే మనసు’ అనే టైటిల్ పోయెటిక్‌గా ఉంటుందని పెట్టలేదు. ప్రేమ కథ కాబట్టి అందరికీ కనెక్ట్ అవుతుందని ఈ టైటిల్ పెట్టాం. ఈ సినిమా యూత్, ఫ్యామిలీకి కనెక్ట్ అయ్యేలా ఉంటుంది. ఇక ప్రేమ కథా చిత్రాల్లో ప్రేమ అనేది ప్రధానంగా ఉన్నా… దాన్ని పాత్రల ప్రకారం ఎలా డీల్ చేశామనేదే ముఖ్యం.
రావాల్సినంత గుర్తింపు రాలేదు…
హను మంచి దర్శకుడు. తనను అందరూ జూనియర్ సుకుమార్ అని అంటారు. ఓ మంచి టెక్నీషియన్‌గా తనకు రావాల్సినంత గుర్తింపు రాలేదు. 15 ఏళ్లుగా అతను నాకు మంచి ఫ్రెండ్. నిర్మాత సుధాకర్‌తో సినిమా చేయాలనుకోగానే దర్శకుడు ఎవరైతే బావుంటుందని ఆలోచించాం. చివరికి హను అయితే బావుంటుందని అనుకున్నాం. అతను మూడు యాక్షన్ సినిమాల కథలు చెప్పాడు. అవేమీ వద్దని లవ్ సినిమా చేసి పెట్టమని అన్నాను.
అదే సినిమాకు హైలైట్…
సాయి పల్లవి అద్భుతమైన నటి. తనతో ఈ సినిమా చేసినప్పుడు కంఫర్ట్‌గా ఫీలయ్యాను. మా మధ్య కెమిస్ట్రీయే సినిమాకు హైలైట్.
మంచి సినిమాలనే ఇచ్చారు…
డబ్బులే సంపాదించుకోవాలంటే వరుసగా సినిమాలు చేయవచ్చు. కానీ నేనలా కాదు. ఓ సినిమా కోసం వంద శాతం కష్టపడతాను. మిగతాది దేవుడి దయ. నేను దర్శకులను నమ్ముకున్నాను. వారు నాకు మంచి సినిమాలనే ఇచ్చారు.
అది ఫెంటాస్టిక్ మూవీ…
తమిళ్ హిట్ మూవీ ‘96’ రీమేక్‌కు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయి. త్వరలోనే ఈ సినిమా గురించి ప్రకటిస్తాం. తమిళంలో ఈ సినిమా చూశాను. ఫెంటాస్టిక్ మూవీ ఇది.
వేరియేషన్ ఉన్న సినిమాలు చేస్తున్నా…
నా కెరీర్‌లో ఏదీ ప్లాన్ చేసుకోలేదు. మంచి సినిమాలు చేయాలనే ఆలోచనతోనే సాగాను. ఓ జోనర్‌లో సినిమా చేసిన తర్వాత వెంటనే అదే జోనర్‌లో సినిమా చేయకూడదని అనుకున్నాను. వేరియేషన్ ఉన్న సినిమాలు చేసుకుంటూ వస్తున్నాను.

Interview with Sharwanand About Padi Padi Leche Manasu

Telangana news