Search
Saturday 17 November 2018
  • :
  • :
Latest News

అల్లు అర్జున్ నాకు ఇన్‌స్పిరేషన్

Sumanth

అప్రభాకర్ దర్శకత్వంలో సుమంత్ శైలేంద్ర, ఈషా రెబ్బ హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం ‘బ్రాండ్ బాబు’. శ్రీ శైలేంద్ర ప్రొడక్షన్స్ పతాకంపై ఈ చిత్రాన్ని శైలేంద్ర బాబు నిర్మించారు. మారుతి కథ అందించిన ఈ చిత్రం ఆగస్టు 3న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా హీరో సుమంత్ శైలేంద్ర మాట్లాడుతూ “కన్నడంలో హీరోగా నాలుగు సినిమాలు చేశాను. మా నాన్న శైలేంద్ర బాబు నిర్మాతగా కన్నడంలో శివరాజ్ కుమార్, ఉపేంద్రలతో సినిమాలు తీశారు. దాదాపు 30 సంవత్సరాల నుండి ఆయన సినీ నిర్మాణంలో ఉన్నారు. ఇక తెలుగులో నా మొదటి చిత్రం ‘బ్రాండ్ బాబు’. మంచి కమర్షియల్ అంశాలతో ఫుల్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా ఉంటుంది. ఒక విధంగా చెప్పాలంటే పక్కా మారుతి బ్రాండ్ మూవీ ఇది. మహానుభావుడు, భలే భలే మగాడివోయ్ చిత్రాల శైలిలోనే ఈ సినిమా సాగుతుంది. చిన్న వస్తువులకు కూడా బ్రాండ్ ఉండాలని కోరుకునే యువకుడి పాత్రలో నటించాను. అతని జీవితంలోకి ఏ బ్రాండ్ తెలియని ఓ అమ్మాయి వస్తుంది. ఆతర్వాత ఏమైంది అనేదే ఈ సినిమా. దర్శకుడు ప్రభాకర్ ఆల్‌రౌండర్ అని చెప్పవచ్చు.  డైరెక్టర్, యాక్టర్, యాంకర్, డాన్సర్‌గా ఆయనకు మంచి టాలెంట్ ఉంది. ఇక అల్లుఅర్జున్ సినిమా ‘ఆర్య’ చూసి హీరో కావాలని అనుకున్నాను. ఆయనే నాకు ఇన్‌స్పిరేషన్. బన్నీని రెండు, మూడు సార్లు కలిశాను. ఆయన చాలా గొప్ప వ్యక్తి. అందరితోనూ సరదాగా ఉంటారు”అని తెలిపారు.

Comments

comments