Home స్కోర్ విరాట్ జంట జయ గంట

విరాట్ జంట జయ గంట

విజయం ముంగిట టీమిండియా

విరాట్ కోహ్లి మూడో టెస్ట్ ద్విశతకం
జయంత్ యాదవ్ తొలి టెస్ట్ శతకం
కెప్టెన్‌గా ధోనీని మించిపోయిన విరాట్ పరుగుల రికార్డు

అజరుద్దీన్- కుంబ్లే భాగస్వామ్య రికార్డును బద్దలుకొట్టిన విరాట్-జయంత్ భాగస్వామ్య రికార్డు

teamముంబయి: వాంఖడే స్టేడియంలో ఆదివారం భారత్-ఇంగ్లాండ్ జట్ల మధ్య జరిగిన నాలుగో టెస్ట్ నాలుగో రోజున కోహ్లి సేన ఇంగ్లాండ్‌పై పట్టు బిగించిం ది. ఉదయపు సెషన్ విరాట్ కో హ్లి, ఆల్‌రౌండర్ జయంత్ యా దవ్‌లది కాగా, మధ్యాహ్నం సెషన్ స్పిన్‌త్రయంలైన రవి చంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, జయంత్‌లది అ యింది. విరాట్ కోహ్లి సిరీ స్‌లో మూడో ద్విశతకం రికార్డును నమోదు చేశాడు. దానికి జయంత్ యాదవ్ తొలి శతకం చేయడంతో టీ మిండియా స్కోరు భారీగా 631కి చేరింది. దాంతో టీమిండియా 231 పరుగుల ఆధిక్యతలో నిలిచింది. నాలుగో టెస్ట్ నాలుగో రోజున(ఆదివారం) 9వ బ్యాట్స్‌మన్‌గా వచ్చిన జయంత్ టెస్ట్‌లో శతకాన్ని నమోదు చేసినప్పటికీ 104 పరుగులకు ఔట్ అయి నిరాశపరిచాడు. ఆదిల్ రషీద్ వేసిన బంతిని కవర్స్‌లో ఆడబోయి ఔటయ్యాడు. కానీ అతడు మిస్ కావడంతో బెయిర్‌స్టో సునాయాసంగా స్టంపింగ్ చేసేశాడు. విరాట్ కోహ్లి సైతం టి20 పద్ధతిలో ఆడబోయి 235 పరుగులకు ఔటయ్యాడు. ఏది ఏమైనప్పటికీ విరాట్, జయంత్ ద్వయం తమ బ్యాటింగ్‌తో స్టేడియంలోని 20,000 ప్రేక్షకులను అలరించారు. విరాట్ కోహ్లి, జయంత్ యాదవ్‌లు 244 నిమిషాలపాటు 352 బంతులాడి 241 భాగస్వామ్యాన్ని నిలిపారు. వీరిద్దరూ తమ భాగస్వామ్యంలో ఇదివరలో కోల్‌కతాలో 1996-97లో దక్షిణాఫ్రికాపై టీమిండియా ఆడినప్పుడు మొహమ్మద్ అజరుద్దీన్, అనిల్ కుంబ్లే(ప్రస్తుత ప్రధాన కోచ్) నెలకొల్పిన రికార్డు ను బద్ధలుకొట్టారు.
తిప్పేసిన స్పిన్ త్రయం
రవిచంద్రన్ అశ్విన్ 49 పరుగులిచ్చి 2 వికెట్లు, రవీంద్ర జడేజా 58 పరుగు లిచ్చి 2 వికెట్లు, జయంత్ యా ద్ 39 పరుగులిచ్చి 1 వికెటు తీసుకోగా, భువనేశ్వర్ కుమార్ 11 పరుగులిచ్చి 1 వికెటు తీసు కోవడంతో ఇంగ్లాండ్ జట్టు 182 పరు గులకే 6 వికెట్లు కోల్పోయి క్లిష్ట స్థితిలో పడింది. భువనేశ్వర్ కుమార్ కీటన్ జెన్నిం గ్స్‌ను గోల్డెన్ డక్‌గా ఔట్ చేయడం చెప్పుకోదగ్గ విషయం. ఇంగ్లాండ్ కెప్టెన్ అలస్టెయిర్ కుక్, జో రూట్ ఇంగ్లాండ్ జట్టును నిలబెట్టడానికి కాసేపు ప్రయత్నించారు. కీనీ జడేజా కుక్(18) క్యాచ్ పట్టుకోవడంతో వారి వారి శ్రమ ఫలించలేదు. మోయిన్ ఆలీని జడేజా డక్ ఔట్ చేసి పెవిలియన్‌కు పంపాడు. అప్పటికి ఇంగ్లాండ్ 3 వికెట్ల నష్టానికి 49 పరుగులే చేసింది. ఆ దశలో వచ్చిన బెయిర్ స్టో, జో రూట్‌తో కలసి 92 పరుగుల భాగస్వామ్యాన్ని నాలుగో వికెట్‌కు నెల కొల్పాడు. వారిద్దరూ గేమ్‌ను ముందుకు తీసుకెళుతున్నట్టు కనిపిస్తున్న సమయంలో… రూట్ 77 పరుగుల వద్ద ఉండగా జయంత్ అతడిని

ఎల్‌బిడబ్లు చేశాడు. టీ విరామం సెషన్ తర్వాత ఇంగ్లాండ్ జట్టు గడ్డు పరిస్థితిలో పడిపోయింది. బెయిర్‌స్టోని కూడా భారత్ జట్టు పెవిలి యన్‌కు పంపించి ఉండేదే…అశ్విన్ బంతిని రివర్స్ స్వీప్ చేసిన అతడి బాల్‌ను స్లిప్‌లో ఉన్న కోహ్లి క్యాచ్ చేయలేకపోయాడు. అప్పుడు బెయిర్ స్టో 14 పరుగుల వద్ద, ఇంగ్లాండ్ 3 వికెట్లకు 98 స్కోరు వద్ద ఉండింది.
రికార్డు తిరగరాసిన కోహ్లి
ఈ సీజన్‌లో విరాట్ కోహ్లి మూడో ద్విశతకం చేశాడు. పైగా వరుసగా మూడు సిరీస్‌లో మూడు ద్విశతకాలు నమోదు చేసిన తొలి బ్యాట్స్‌మన్‌గా రికార్డుకెక్కాడు. క్రికెట్‌లోని మూడు ఫార్మాట్లలో అత్యధిక పరుగులు చేసి పొజిషన్ జాబితాలో అగ్రశ్రేణిలో నిలబడ్డాడు. కెప్టెన్‌గా అత్యధిక పరుగులు నమోదు చేయడంలో అతడు ఎం.ఎస్.ధోనీ224 పరుగుల రికార్డును అధిగమించాడు. ధోనీ 2013లో ఆస్ట్రేలియాపై ఆ రికార్డును నమోదు చేశాడు.
ఇంగ్లాండ్ టీమ్
భారత జట్టు నిర్దేశించిన లక్ష ఛేదనకు దిగిన ఇంగ్లాండ్ జట్టు ఆదివారం ఆట ముగిసే సమయానికి(స్టంప్స్) 6 వికెట్ల నష్టానికి 182 పరుగులు మాత్రమే చేసింది. వారి చేతిలో ఇంకా 4 వికెట్లున్నప్పటికీ ఇంకా 49 పరుగులు వెనుకబడి ఉన్నారు. ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్ జానీ బెయిర్‌స్టో (50), జోస్ బట్లర్ సోమవారం ఐదో రోజు ఆటను కొనసాగించనున్నా రు.