Search
Saturday 22 September 2018
  • :
  • :
Latest News

శివాజీ రాజా తనయుడు విజయ్ రాజా హీరోగా…

Vijay-Raja

‘మా’ అధ్యక్షుడు, ప్రముఖ నటుడు శివాజీ రాజా తనయుడు విజయ్ రాజా హీరోగా పరిచయమవుతూ రూపొందుతున్న చిత్రం ‘ఏదైనా జరగొచ్చు’. కె.రమాకాంత్ దర్శకత్వంలో వెట్ బ్రెయిన్ ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోలో ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కె.రాఘవేంద్రరావు ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ నివ్వగా… రవిరాజా పినిశెట్టి కెమెరా స్విచాన్ చేశారు. హరీష్ శంకర్ గౌరవ దర్శకత్వం వహించారు. పరుచూరి బ్రదర్స్, ఎస్.వి.కృష్ణారెడ్డి, కె.అచ్చిరెడ్డి, శ్రీకాంత్, తరుణ్ పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటైన విలేకరుల సమావేశంలో శివాజీ రాజా మాట్లాడుతూ “32 ఏళ్లుగా నటుడిగా నన్ను ఆదరిస్తున్నారు. అదే ఆదరణ, ప్రేమను మా అబ్బాయి విజయ్ రాజాకు కూడా అందించాలని కోరుకుంటున్నాను. దర్శకుడు కె.రమాకాంత్ రెండేళ్లుగా ఈ స్క్రిప్ట్‌పై పనిచేస్తున్నాడు. ఇక విజయ్… సత్యానంద్ ఇనిస్టిట్యూట్‌లో యాక్టింగ్, డాన్స్, ఫైట్స్‌లో శిక్షణ తీసుకున్నాడు”అని అన్నారు. దర్శకుడు కె.రమాకాంత్ మాట్లాడుతూ “హార్రర్ జానర్‌లో సాగే కామెడీ థ్రిల్లర్ చిత్రమిది. కథ నచ్చి నాపై నమ్మకంతో శివాజీరాజా, నిర్మాత ఈ అవకాశం కల్పించారు”అని తెలిపారు. హీరో విజయ్ రాజా మాట్లాడుతూ “నాన్న గర్వపడేలా చేస్తానన్న నమ్మకంతో హీరోగా తొలి అడుగు వేస్తున్నా. దర్శకుడు మంచి కథతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు”అని పేర్కొన్నారు. ఈ చిత్రానికి సంగీతంః శ్రీకాంత్ పెండ్యాల, ఆర్ట్‌ః చిన్నా, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌ః విజయ్ ప్రకాష్ అన్నంరెడ్డి.

Comments

comments