Search
Sunday 23 September 2018
  • :
  • :
Latest News

యడ్యూరప్ప ప్రమాణస్వీకారంపై మరోమారు విచారణ

Supreme respond on SC and ST judgment

ఢిల్లీ: యడ్యూరప్ప ప్రమాణస్వీకారంపై శుక్రవారం సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. కాంగ్రెస్, జెడిఎస్ పిటిషన్‌పై మరోసారి వాదనలు వినిపించనున్నాయి. జస్టిస్ సిక్రీ, జస్టిస్ భూషణ్, జస్టిస్ బాబ్దేలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఉదయం 10.30 గంటలకు వాదనలు విననుంది.  యడ్యూరప్ప ప్రమాణస్వీకార అంశం తుది తీర్పుకు లోబడి ఉంటుందని ధర్మాసనం తేల్చి చెప్పింది. యడ్యూరప్ప ప్రమాణస్వీకారం ఆపాలని కాంగ్రెస్-జెడిఎస్ పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. కాంగ్రెస్, జెడిఎస్ తరపున అభిషేక్ సింఘ్వీ వాదనలు వినిపించనున్నారు. యడ్యూరప్ప కర్నాటక సిఎంగా గురువారం ప్రమాణస్వీకారం చేసిన విషయం విధితమే.

Comments

comments