Home తాజా వార్తలు పిఎస్ యు బ్యాంకులకు రూ. 41000 కోట్ల మూలధనం

పిఎస్ యు బ్యాంకులకు రూ. 41000 కోట్ల మూలధనం

Finance Minister Arun Jaitley

 

లోక్‌సభలో ఆర్థిక మంత్రి ప్రతిపాదన
మొత్తం రూ 85,949 కోట్ల అదనపు వ్యయ పద్దులు
బ్యాంకుల పునరుద్ధరణకే సగభాగం
ఎయిరిండియాకు రూ 2345 కోట్లు 

న్యూఢిల్లీ : వచ్చే మార్చితో ముగిసే ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి రూ 85,949 కోట్ల అదనపు స్థూల వ్యయాన్ని అనుబంధ పద్దులలో కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. దీనికి పార్లమెంట్ ఆమోదం కోసం అభ్యర్థించింది. బడ్జెట్‌కు అదనంగా ఈ వ్యయ పద్దులను లోక్‌సభలో గురువారం ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టారు. ఈ అదనపు మొత్తంలో దాదాపు సగభాగం ప్రభుత్వ రంగ బ్యాంకులకు పెట్టుబడుల కల్పనగా ఉంటుంది. దీనిని రిక్యాపిటలైషన్ బాండ్స్ రూపంలో ఈ మిగిలిన ఆర్థిక సంవత్సరంలో సమకూరుస్తారు. ఇక ఈ మొత్తంలో కేవ లం రూ 15,065.49 కోట్లు నికర నగదు కేటాయింపుగా ఉంటుంది. ఈ వివరాలను ఆర్థిక మంత్రి 201819 సంవత్సరపు అనుబంధ పద్దుల రెండో దశలో భాగంగా సభా ఆమోదానికి పెట్టారు.

ఈ పద్దులతో జాతీయ విమానయాన సంస్థ ఎయిరిండియాకు రూ 2345 కోట్ల పునరుద్ధరణ పథకాన్ని తలపెట్టారు. ఇక ప్రభుత్వ ఆధీనంలో ని బ్యాంకులకు రూ.41000కోట్ల మేర ప్రభుత్వ సెక్యూరి టీ (రిక్యాపిటలైజేషన్ బాండ్ల)ని సమకూరుస్తారని తెలిపా రు. వచ్చే రెండేళ్లలో ప్రభుత్వ రంగ బ్యాంకులలో రూ 2.11 లక్షల కోట్లను పెట్టుబడులుగా పెట్టాలని 2017 అక్టోబర్‌లో ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగం గా రూ 18,139 కోట్ల బడ్జెట్ కేటాయింపులు , రూ 1.35 లక్షల కోట్ల మేర రిక్యాపిటలైజేషన్ బాండ్లను , మిగిలిన మొత్తాన్ని బ్యాంకులు మార్కెట్ నుంచి క్యాపిటల్ సేకరణ ల రూపంలో సమకూర్చుకునే విధంగా ఏర్పాటు చేశారు. ఈ మేరకు ప్రభుత్వ ఈక్విటీ రూ. 58000 కోట్ల మేర సడలింపులు ప్రకటించారు. పిఎస్‌బిలు వచ్చే ఏడాది మార్చి నాటికి స్టాక్ మార్కెట్ల ద్వారా రూ 58000 కోట్లను సమకూర్చుకోవల్సి ఉందని నిర్ధేశించారు.

బ్యాంకుల సంక్షేమానికి ఉద్ధేశించిన బెసెల్ పద్ధతులకు అనుగుణంగా సమర్థతను సంతరించుకోవాలని తలపెట్టారు. అయితే సరైన మార్కెట్ పరిస్థితులు లేకపోవడం, ఇతర కారణాలతో బ్యాంకులు నిర్ధేశిత నిధులను మార్కెట్ల నుంచి ఇప్పటివరకూ సమకూర్చుకోలేక పొయ్యాయి. అంతేకాకుండా పలు బ్యాంకుల నిరర్థక ఆస్తులు పెరిగాయి. మొండి బకాయిలు తీవ్రస్థాయికి చేరుకున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరపు మొదటి త్రైమాసికాలలో నెలకొన్న గడ్డు పరిస్థితితో బ్యాంకులపై పెనుభారం పడింది. ఆర్థిక మంత్రి ప్రతిపాదిత అనుబంధ పద్దులలో రైల్వేలకు వివిధ పనులు, పథకాలు చేపట్టేందుకు అదనంగా రూ 5344 కోట్ల వ్యయ ప్రతిపాదనలు చేశారు. ఆయిల్ ఇండియా లిమిటెడ్ వారు జారీ చేసిన బోనన్ షేర్లకు అదనపు ఈక్విటీ పెట్టుబడిగా రూ 250 కోట్ల ప్రతిపాదనలు చేశారు.

Investment in Public Sector Banks

Telangana Latest News