Search
Wednesday 19 September 2018
  • :
  • :
Latest News

హెల్తీ బ్యాంక్‌లతో పెట్టుబడులు, ఉపాధి

ప్యాకేజీని స్వాగతించిన ఆర్‌బిఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్

urjith

న్యూఢిల్లీ : రూ.2.11 లక్షల కోట్ల బ్యాంకింగ్ మూలధనం సమకూర్చనున్నట్టు ప్రభుత్వం ప్రకటించడం చిరస్మరణీయంగా గుర్తుండిపోయే చర్య అని ఆర్‌బిఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ పేర్కొన్నారు. ఈ నిర్ణయం భారత్ ఆర్థిక వ్యవస్థను ఆరోగ్యవంత, సురక్షితమైన బాటలో నడిపేందుకు దోహదం చేస్తుందని అన్నారు. బ్యాంకింగ్, ఆర్థిక వ్యవస్థ సరైన మూలధనాన్ని కల్గి ఉంటే ఆర్థిక వృద్ధి నిలకడగా ఉంటుందని అన్నారు. ఆర్థిక చరిత్రను చూస్తే ఆరోగ్యవంతమైన బ్యాంకులు రుణగ్రస్తులు, సంస్థలను కూడా హెల్తీగా కొనసాగించడంలో దోహదం చేస్తాయని, దీంతో పెట్టుబడులు, ఉపాధి అవకాశాల సృష్టి ఉంటుందని ఉర్జిత్ వివరించారు. మంగళవారం కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ రెండేళ్లకు గాను పిఎస్‌యు బ్యాంకులకు రూ.2.11 లక్షల కోట్ల ప్యాకేజీని ప్రకటించారు. దీనిలో రూ.1.35 లక్షల కోట్లు బాండ్ల రూపంలో సేకరిస్తామని తెలిపారు. మిగతా రూ.76వేల కోట్ల నిధులను బడ్జెట్, మార్కెట్ రుణాలతో కేటాయిస్తామని జైట్లీ చెప్పారు.
ప్రభుత్వ నిర్ణయాన్ని ఆర్‌బిఐ గవర్నర్ పటేల్ స్వాగతించారు. ఈమేరకు ఓ ప్రకటన చేస్తూ.. మంచి మూలధనం కల్గి ఉన్న బ్యాంకింగ్ వ్యవస్థ నిలకడైన వృద్ధికి బాట లు వేస్తుందని అన్నారు. ఇదే విషయాన్ని గత ఆర్థిక చరిత్ర కూడా రుజువు చేసిందని అన్నారు. బ్యాంకుల ఎన్‌పిఎ(నిరర్థక ఆస్తులు) 2015 మార్చిలో రూ.2.75 లక్షల కోట్లు ఉండగా, 2017 జూన్ నాటికి ఎన్‌పిఎ రూ.7.33 లక్షల కోట్లకు పెరిగింది. అంటే రెట్టింపు కంటే ఎక్కువ అయ్యా యి. దశాబ్ద కాలంలో తొలిసారిగా తాము వాస్తవమైన అవకాశాన్ని పొందామని, దీంతో సమస్యలను పరిష్కరించుకోవచ్చని ఉర్జిత్ అన్నారు. ఆర్థిక వృద్ధి బలోపేతం, ఉపాధి క ల్పన, క్రెడిట్ ప్రవాహాన్ని పెంచడమే లక్షంగా ఉద్దీపన ప్యాకేజీ ప్రభుత్వం ప్రకటించిందని, దీంతో అనేక సమస్య లు పరిష్కారమవుతాయని ఉర్జిట్ పటేల్ అన్నారు.
కాగా రానున్న రోజుల్లో మరిన్ని సంస్కరణలు చేపడతామని, బ్యాంకులను అన్నిరకాలుగా ఆదుకుంటామని ఆర్థికమంత్రి జైట్లీ పేర్కొన్నారు. దేశ ఆర్థిక పరిస్థితిపై ప్రభుత్వం క్షుణ్ణంగా చర్చిస్తోందని, భారత ఆర్థిక వ్యవస్థ మూలాలు ఎంతో పటిష్టంగా ఉన్నాయని అన్నారు. అన్ని సవాళ్ళను తట్టుకునే సత్తా మనకు ఉందని, దేశ మౌలిక సదుపాయాల రంగంలో భారీ పెట్టుబడుల అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. గత మూడేళ్లలో దేశ ఆర్థిక వ్యవ స్థ, వృద్ధిరేటు మెరుగ్గా ఉందని, దీర్ఘకాలంలో ఆర్థిక సంస్కరణల ఫలితాలు అందుతాయని తెలిపారు. విదేశీ మారక నిల్వలు 400 బిలియన్ డాలర్లకు చేరాయని- జైట్లీ అన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం ఇప్పటికే రూ.11.47 లక్షల కోట్లను మూలధన వ్యయంగా వెచ్చించిందని-, వచ్చే ఐదేళ్ళలో రోడ్లు, మౌలిక సదుపాయాల కోసం రూ.7 లక్ష ల కోట్లను ఇన్వెస్ట్ చేయనున్నామని ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి సుభాష్ గార్గ్ తెలిపారు. గత మూడేళ్లుగా జిడిపి(స్థూల దేశీయోత్పత్తి) 7.5శాతంగా ఉందని, కరెంట్ ఖాతా లోటు చాలా తక్కువ స్థాయిలో ఉందని వెల్లడించారు.

Comments

comments