Home తాజా వార్తలు సరికొత్త ఫీచర్లతో ఐఫోన్ 7

సరికొత్త ఫీచర్లతో ఐఫోన్ 7

iPhone-7ఆపిల్ ఐఫోన్స్ అంటేనే ఎనలేని క్రేజ్ ఉంది. అందులోనూ ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్లతో తనకంటూ ఓ స్పెషల్ మార్కెట్‌ను ఏర్పచుకుంది ఆపిల్ సంస్థ. ఇప్పుడు ఇదే తరహాలో విప్లవాత్మక ఫీచర్లతో ఐఫోన్ సెవన్‌ను మార్కెట్లోకి తీసుకురానుంది ఆపిల్. ఇప్పటికే ఈ ఐఫోన్ ఫీచర్లు కస్టమర్లను ఎంతోగాను ఆకర్షిస్తున్నాయి. తాజాగా వాటర్ ప్రూఫ్, వైర్‌లెస్ ఛార్జింగ్ లాంటి అధునాతన ఫీచర్లతో ఐఫోన్ 7 మార్కెట్‌లోకి రానున్నట్లు సమాచారం. అంతేకాకుండా వైర్‌లెస్ ఇయర్‌ఫోన్‌లను కూడా ఈ ఫోన్‌తో అందుబాటులోకి తీసుకువస్తున్నారు. వీటితోపాటు ఇంకో రెండు సదుపాయాలు కూడా ఐఫోన్ 7లో ఉండనున్నాయి. అవి ఒకటి వాటర్ రెసిస్టెంట్ డిస్‌స్లే, రెండవది నాయిస్ క్యాన్సలేషన్ టెక్నాలజీ. దీంతో ఐఫోన్ ప్రియులు ఐఫోన్7 కోసం ఎంతో అత్రుతగా ఎదురు చూస్తున్నారనడంలో ఎలాంటి సందేహం లేదు.