Search
Thursday 20 September 2018
  • :
  • :
Latest News

7న భారత మార్కెట్లోకి ఐఫోన్-7

iPhone-7ప్రారంభ రూ.60 వేలు

న్యూఢిల్లీ: ఆపిల్ తాజా స్మార్ట్‌ఫోన్లు ఐఫోన్-7, ఐఫోన్-7 ప్లస్‌లు మొత్తానికి మార్కెట్లోకి విడుదల చేశారు. అయితే భారత్ మార్కెట్లోకి ఎప్పుడు వస్తాయి? అంటే ఇంకా కొద్ది రోజులు వేచి చూడాల్సిందే. అక్టోబర్ 7న దేశీయ మార్కెట్లోకి యాపిల్ కొత్త ఫోన్లు రానున్నాయని, వీటి ధర రూ.60 వేల నుంచి ప్రారంభమవుతుందని అమెరికాకు చెందిన టెక్నాలజీ సంస్థ వెల్లడించింది. అయితే తొలిసారిగా ఆపిల్ సంస్థ లాంఛింగ్ కార్యక్రమంలో భారత్ మార్కెట్ ధరను ప్రకటించడం గమనార్హం. బుధవారం శాన్ ప్రాన్సిస్కోలో లాంఛింగ్ వేడుకలో ఆపిల్ సిఇఒ టిమ్ కుక్ మాట్లాడుతూ, అత్యంత అధునాత ఐఫోన్‌లో స్టీరియో స్పీకర్లు, వాటర్, డస్ట్ నిరోధక టెక్నాలజీ, వైర్లెస్ హెడ్‌ఫోన్లు ఉంటాయని అన్నారు. యాపిల్ అధికార కార్యాలయం కాలిఫోర్నియాలో ఉంది. ఈ సంస్థ తాజాగా నెక్స్ జనరేషన్ యాపిల్ వాచ్‌లను కూడా విడుదల చేయగా, వీటి యాప్ స్టోర్, ఆపరేటింగ్ సిస్టమ్ ఐఒఎస్10ను ఆప్‌డేట్ చేసింది. సెప్టెంబర్ 16 నుంచి అమెరికాలో ఈ ఫోన్ అమ్మకాలు ప్రారంభమవుతున్నాయి. సెప్టెంబర్ 9నుంచి ఈ ఫోన్ల ప్రీ-ఆర్డర్లను యాపిల్ చేపట్టనుంది. భారత్‌లో ఈ రెండు కొత్త ఐఫోన్ ధరలు రూ.60,000(32జిబి మోడల్) నుంచి ప్రారంభంకాబోతున్నాయి. సిల్వర్, రోజ్ గోల్ , బ్లాక్, జెట్ బ్లాక్ రంగుల్లో 32జిబి, 128జిబి, 256 జిబి వేరియంట్లలో ఐఫోన్7, ఐఫోన్ 7 ప్లస్‌లు అందుబాటులోకి వచ్చాయి. రెండో దశలో భారత్‌లో ఈ విక్రయాలు చేపడతామని యాపిల్ ప్రకటించింది. రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగిన చైనాలో తన ప్రాబల్యం తగ్గడంతో, స్మార్ట్‌ఫోన్ల మార్కెట్‌కు, ఐఫోన్లకు అతిపెద్ద మార్కెట్‌గా మారనున్న భారత్‌పైన యాపిల్ ప్రధానంగా దృష్టిసారించింది. స్మార్ట్‌ఫోన్ల రంగంలో రారాజు సామ్‌సంగ్ గెలాక్సీ నోట్7ను ఫోన్‌ను నెలముందే విడుదల చేసినప్పటికీ, వీటికి సంబంధించిన బ్యాటరీలు పేలిపోవడం వంటి సంఘటనలతో ఆ కంపెనీకి సమస్యగా మారింది. ఇది యాపిల్‌కు మరింత ప్లస్ కానుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

Comments

comments