Search
Saturday 22 September 2018
  • :
  • :

ఐఫోన్ ఎక్స్, ఐఫోన్ 8, 8 ప్లస్

 ఐఫోన్ 8, 8 ప్లస్ మోడళ్లకు ఈ నెలాఖరులో బుకింగ్
 అక్టోబరు 27 నుంచి ఐఫోన్ ఎక్స్

Iphoneన్యూఢిల్లీ: ఎంతగానో వేచిచూస్తున్న మొబైల్ దిగ్గ జం యాపిల్ నుంచి ఐఫోన్ ఎక్స్ స్మార్ట్‌ఫోన్ ఎట్టకేలకు విడుదలైంది. యాపిల్ తన పదో వార్షికోత్సవం సందర్భంగా మంగళవారం రాత్రి అమెరి కాలో ఈ ఫోన్‌ను లాంఛ్ చేసింది. రీడిజైన్ చేసిన ఈ ఫోన్‌ను అద్భుతమైన లుక్‌ను కలిగి ఉంటుంది. ఐఫోన్ 8, ఐఫోన్ 8 ప్లస్ మోడళ్లను కూడా ప్రవేశపెట్టగా, ఇవి ఐఫోన్ 7ను పోలి ఉన్నాయి. ఈ రెండు ఫోన్లకు నెలాఖరులో ప్రీ బుకింగ్ ప్రారంభిస్తారు. ఐఫోన్ ఎక్స్ నవంబరు 3 నుంచి భారత్‌లో లభ్యం కానుంది. 64 జిబి, 256 జిబి మోడళ్లలో సిల్వర్, స్పే గ్రే రంగుల్లో ఉండే ఈ ఫోన్ ప్రారంభ రూ.89,000 నుంచి ఉండనుంది. ఈ ఫోన్ కోసం ప్రి ఆర్డర్ అక్టోబరు 27 నుంచి ప్రారంభమవుతుంది. ఐఫోన్8 64 జిబి ధర రూ 64,000, అలాగే 256 జిబి వేరియంట్ ధర రూ. 77,000గా ఉంది. ఐఫోన్ 8 ప్లస్ 64 జిబి ప్రా రంభ ధర రూ.73,000, 256 జిబి వేరియంట్ భారత్ వినియోగదారులకు రూ.86,000 ఉంది. సెప్టెంబరు 15 నుంచి ఈ ఫోన్ ముందుగానే ఆర్డ రు చేయవచ్చు. సెప్టెంబరు 29 నుంచి ఫోన్లు లభిస్తాయి. భారత్‌లో ఐఫోన్ 6ఎస్, 6ఎస్ ప్లస్, ఐఫో న్ 7, 7ప్లస్ స్మార్ట్‌ఫోన్ ధరలను తగ్గిస్తున్నట్లు కం పెనీ ప్రకటించింది. దీంతో యాపిల్ ఐఫోన్ 7 ధర ఇప్పుడు రూ.50వేల దిగువకు వచ్చింది. గతేడాది అక్టోబర్‌లో మార్కెట్లోకి వచ్చిన ఐఫోన్ 7 ప్రారంభ ధర రూ.60వేలుగా ఉన్న విషయం తెలిసిందే.

Comments

comments