Search
Wednesday 14 November 2018
  • :
  • :
Latest News

ఐఫోన్8 వచ్చేస్తుందటా.. ఇవే ఫీచర్లు

IPhone-8మీరు ఐఫోన్ అభిమానులా… అయితే ఈ వార్త మీకోసమే.. ఇప్పటికే ఐఫోన్7 విడుదలై మార్కెట్‌లో తన స్థానాన్ని పదిలం చేసుకుంది. ధర ఎంత ఉన్నకానీ ఐఫోన్ ప్రేమికులు కొనుగోలు మాత్రం వెనకాడట్లేదు. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ వార్త ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతోంది. ఆపిల్ సంస్థ ఐఫోన్8 ఫోన్‌ను విడుదల చేయాలనే యోచనలో ఉందన్న వార్త ప్రస్తుతం హాట్‌టాపిక్‌గా మారింది. ఈ రూమర్ ప్రకారం తర్వాత వచ్చే ఐఫోన్‌లో పిజికల్ హోమ్ బటన్‌ను ఆపిల్ తొలగిస్తుందటా.. ఐఫోన్ 8 మూడు స్క్రీన్ సైజుల్లో మార్కెట్‌లోకి రంగప్రవేశం చేయనుంది. 4.7 అంగుళాలు, 5 అంగుళాలు, 5.5 అంగుళాల ఫోన్లను ఆపిల్ ప్రవేశపెట్టనుంది. పలు రిపోర్టుల ముందస్తు సూచనల ప్రకారం ఐఫోన్ 8ఓలెడ్ డిస్‌ప్లేను కలిగి, అల్యూమినియంకు బదులు మొత్తం గ్లాస్‌తో డిజైన్ చేస్తున్నారని తెలిసింది. ఐఫోన్7 ముందే ఈ విషయాన్ని మార్కెట్ వర్గాలు తెలిపాయి. ఈ ఏడాది తీసుకొచ్చే ఐఫోనే, అల్యూమినియం బాడీతో రూపొందే చివరి ఫోన్ అని పేర్కొన్నాయి.

Comments

comments