Search
Friday 16 November 2018
  • :
  • :

ఈ రోజు మ్యాచ్ లో గెలుపెవరిది? గుజరాత్ లయన్స్ దా.. లేదంటే కలకత్తా నైట్ రైడర్స్ దా…!!?

Gujarat Lion Versus Kolkata Knight Riders Match

రాజ్ కోట్ వేదికగా జరగనున్న ఈ రోజు మ్యాచ్ లో గుజరాత్ లయన్స్ , కలకత్తా నైట్ రైడర్స్ తలపడనన్నాయి. అయితే… ఈ రెండు టీమ్స్ లో ఏ టీమ్ గెలుస్తుందో అంచనా వేయాలంటే చాలా కష్టమే. అయితే…. ఎక్కువగా మ్యాచ్ గెలిచే అవకాశాలు గుజరాత్ లయన్స్ కే ఉందని చెప్పొచ్చు.

ఎందుకంటే… గుజరాత్ లోని రాజ్ కోట్ లో ఉన్న Saurashtra Cricket Association Stadium లో మ్యాచ్ జరుగుతుండటం, గుజరాత్ టీమ్ లో ట్వంటీ ట్వంటీ స్పెషలిస్ట్ బ్యాట్స్ మెన్, గుజరాత్ టీమ్ కెప్టెన్ సురేశ్ రైనా ఉండటం ప్లస్ అయితే… రైనా సొంత ఊరు కూడా గుజరాత్ కావడం ఇంకా కలిసొచ్చే విషయం.

ఇంకా.. గుజరాత్ టీమ్ లో ఆల్ రౌండర్ జడేజా ఉండటం కూడా కలిసొచ్చే విషయం. ఇక.. విదేశీ ఆటగాళ్లలో మెక్ కల్లమ్, స్మిత్, అరున్ ఫించ్, ఆల్ రౌండర్ జేమ్స్ ఫాల్కనర్ లాంటి మేటి ఆటగాళ్లు ఉండటం గుజరాత్ టీమ్ కు కలిసొచ్చే అవకాశం ఉంది.

వికెట్ కీపర్ దినేశ్ కార్తిక్ కూడా ప్రస్తుతానికి మంచి ఫామ్ లోనే ఉన్నాడు. అయితే… గుజరాత్ టీమ్ లో మంచి బ్యాట్స్ మెన్స్ ఉన్నప్పటికీ… ప్రవీణ్ కుమార్, జడేజా తప్పిచ్చి మిగతా బౌలర్లు అంత చెప్పుకోదగ్గ స్థాయిలో లేరు.

ఇక… కలకత్తా నైట్ రైడర్స్ టీమ్ గురించి… కెప్టెన్ గౌతమ్ గంభీర్, వికెట్ కీపర్ రాబిన్ ఉతప్ప, యూసఫ్ పఠాన్, వాక్స్, మనీష్ పాండే లాంటి మేటి ఆటగాళ్లు ఉండటం కూడా ఈ టీమ్ కు ప్లస్ పాయింట్. సునీల్ నరెనే, బౌల్ట్ బౌలర్స్ కూడా కెకెఆర్ టీమ్ కు కలిసొచ్చే అంశం. గాయంతో బౌలర్ ఉమేశ్ యాదవ్ టీమ్ నుంచి తప్పుకోవడం కలకత్తా కు పెద్ద మైనస్ పాయింట్.

ఇంకా.. ఇది వరకు రెండు సార్లు ఐపిఎల్ గెలిచిన కలకత్తా టీమ్ ఈ సారి మొదటి మ్యాచ్ లో తన సత్తా చూపిస్తుందా లేదా? శుక్రవారం రాత్రి 8 గంటలకు జరిగే మ్యాచ్ తో లెక్క తేలనుంది.

Comments

comments