Home స్కోర్ డిసెంబర్ 18న ఐపిఎల్ 2019 వేలం

డిసెంబర్ 18న ఐపిఎల్ 2019 వేలం

IPL 2019
న్యూఢిల్లీ: ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ఆదరణ పొందిన క్రికెట్ టోర్నీగా కీర్తి గడించిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్)2019 సీజన్ కోసం ఆటగాళ్ల వేలం జైపూర్ వేదికగా డిసెంబర్ 18న జరగనుంది. ఈ ఐపిఎల్ వేలానికి మొత్తం 1003 మంది ఆటగాళ్లు వేలంలో పాల్గొనేందుకు తమ పేర్లను రిజస్టర్ చేసుకున్నారని బిసిసిఐ బుధవారం వెల్లడించింది. అందులో 232 మంది విదేశీ ఆటగాళ్లున్నారని వారంతా వేలంలో పాల్గొనేందుకు ఆసక్తి కనబర్చారని తెలిపింది.
బిసిసిఐ నిబంధనల ప్రకారం ఇటీవల ఐపిఎల్‌లోని ఫ్రాంఛైజీలన్నీ.. తాము అట్టిపెట్టుకునే ఆటగాళ్లు, వేలంలోకి విడిచిపెట్టిన క్రికెటర్ల జాబితాని విడుదల చేశాయి. ఆటగాళ్ల రిజస్టర్ జాబితాల ప్రకారం.. 8 జట్లలో కలిపి మొత్తం 70 మంది క్రికెటర్ల భర్తీకి అవకాశం ఏర్పడింది.  జాబితాలో 200 మంది అంతర్జాతీయ క్రికెట్‌లో అనుభవం ఉన్న ఆటగాళ్లు కాగా.. 800 మంది ఇంకా అరంగేట్రం చేయలేదు. ఆ లిస్ట్‌లో 746 మంది భారత క్రికెటర్లే ఉండడం విశేషం.
IPL 2019 auction to take place in Jaipur on December 18

Telangana Latest News