Home IPL 2019 పంజాబ్‌పై ఢిల్లీ ఘన విజయం

పంజాబ్‌పై ఢిల్లీ ఘన విజయం

 

న్యూఢిల్లీ: ఐపిఎల్ 2019 సీజన్‌లో భాగంగా ఫిరోజ్ షా స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో పంజాబ్‌పై ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఘన విజయం సాధించింది. కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌ నిర్దేశించిన 164 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ జట్టు 5 వికెట్ల తేడాతో గెలుపొందింది.  ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ (56) రాణించాడు. కెప్టెన్ శ్రేయస్‌ అయ్యర్‌ (58) అజేయ అర్ధశతకంతో మ్యాచ్ ను గెలిపించాడు. వారిద్దరూ చెలరేగడంతో ఢిల్లీ 19.4 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 166 పరుగులు చేసింది.

అంతకుముదు టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన పంజాబ్ జట్టు  నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 163 పరుగుల చేసింది. క్రిస్‌ గేల్(69) అర్థశతకంతో రాణించాడు. మన్‌దీప్ సింగ్(30), హర్‌ప్రీత్(20)లు ఫర్వాలేదనిపించారు. ఢిల్లీ బౌలర్లలో సందీప్ లామిచానే మూడు వికెట్లు పడగొట్టగా… రబాడా, అక్షర్ పటేల్‌లకు చెరో 2 వికెట్లు దక్కాయి.

IPL 2019 DC vs KXIP: DC won by 5 wickets