Home IPL 2019 రాజస్థాన్ టార్గెట్ 176

రాజస్థాన్ టార్గెట్ 176

 

కోల్‌కతా: ఈడెన్ గార్డెన్స్ వేదికగా రాజస్థాన్ రాయల్స్ తో జరుగుతున్న మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 175 పరుగులు చేసింది. దీంతో కోల్‌కతా, రాజస్థాన్ జట్టుకు 176 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. కెప్టెన్ దినేష్ కార్తిక్ (97 నాటౌట్) రాజస్థాన్ బౌలర్లపై ఫోర్లు, సిక్స్ లతో విరుచుకుపడ్డాడు. నితీశ్ రానా 21 పరుగులతో ఫర్వాలేదనిపించినా.. మిగతా ఆటగాళ్లు ఘోరంగా విఫలమవ్వడంతో కోల్‌కతా భారీ స్కోరు సాధించలేకపోయింది. రాజస్థాన్ బౌలర్లలో వరుణ్ అరోన్ 2 వికెట్లు పడగొట్టగా… శ్రేయస్ గోపాల్, ఉనద్కట్, థామస్ తలో వికెట్ తీశారు.

IPL 2019 RR vs KKR: RR Target 176 runs