Home తాజా వార్తలు కోల్‌కతాపై రాజస్థాన్ విజయం

కోల్‌కతాపై రాజస్థాన్ విజయం

 

కోల్‌కతా: ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ జట్టుపై రాజస్థాన్ రాయల్స్ విజయం సాధించింది. కోల్‌కతా నిర్దేశించిన 176 పరుగుల లక్ష్య ఛేదనలో రాజస్థాన్ 3 వికెట్ల తేడాతో గెలుపొందింది. అజింక్యా రహానె 34, సంజూ శాంసన్ 22, రియాన్ పరాగ్ 47, జోఫ్రా అర్చర్ 27 పరుగులతో రాణించారు.దీంతో రాజస్థాన్ 19.2 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 177 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది.

అంతకుముందు కోల్‌కతా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 175 పరుగులు చేసింది. కెప్టెన్ దినేష్ కార్తిక్ (97 నాటౌట్) రాజస్థాన్ బౌలర్లపై ఫోర్లు, సిక్స్ లతో విరుచుకుపడ్డాడు. నితీశ్ రానా 21 పరుగులతో ఫర్వాలేదనిపించినా.. మిగతా ఆటగాళ్లు ఘోరంగా విఫలమవ్వడంతో కోల్‌కతా భారీ స్కోరు సాధించలేకపోయింది. రాజస్థాన్ బౌలర్లలో వరుణ్ అరోన్ 2 వికెట్లు పడగొట్టగా… శ్రేయస్ గోపాల్, ఉనద్కట్, థామస్ తలో వికెట్ తీశారు.

IPL 2019 RR vs KKR: RR won by 3 vickets