Search
Saturday 22 September 2018
  • :
  • :
Latest News

భారత్‌తో టీ20లకు ఐర్లాండ్ జట్టు ఎంపిక

Ireland name T20I squad to face India in T20 Series

డబ్లిన్: టీమిండియాతో రెండు టీ20 మ్యాచ్‌ల సిరీస్ కోసం ఐర్లాండ్ క్రికెట్ బోర్డు తాజాగా తమ జట్టును ప్రకటించింది. ఈ నెల 27, 29న ఈ రెండు మ్యాచ్‌లు డబ్లిన్ వేదికగా జరగనున్నాయి. 14 మంది సభ్యులతో కూడిన ఈ జట్టుకు గ్యారీ విల్సన్‌ను సారథిగా ఎంపిక చేసింది ఆ దేశ క్రికెట్ బోర్డు. ఇక ఇప్పటికే బిసిసిఐ ఐర్లాండ్‌తో తలపడే కోహ్లీ సారథ్యంలోని జట్టును ప్రకటించిన విషయం తెలిసిందే. శనివారం భారత జట్టు ఈ సిరీస్ కోసం ఐర్లాండ్‌కు బయల్దేరనుంది. ఐర్లాండ్ పర్యటన అనంతరం కోహ్లీసేన ఇంగ్లండ్ వెళ్లనుంది. జూలై 3 నుంచి టీమిండియా ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్ ఆడనుంది. తాజాగా ఐర్లాండ్ ప్రకటించిన జట్టు వివరాలు…

ఐర్లాండ్‌ జట్టు: గ్యారీ విల్సన్‌ (కెప్టెన్‌), ఆండ్రూ బాల్‌బిర్ని, పీటర్‌ చేజ్‌, జార్జ్‌ డాక్‌రెల్‌, జాష్‌ లిటిల్‌, ఆండ్రూ మెక్‌బ్రైన్‌, కెవిన్‌ ఓబ్రియన్‌, విలియమ్‌ పోర్టర్‌ఫీల్డ్‌, స్టువర్ట్‌ పోయంటర్‌, బోయడ్‌ రాన్‌కిన్‌, జేమ్స్ షన్నాన్‌, సిమి సింగ్‌, పాల్‌ స్టిర్లింగ్‌, స్టువర్ట్‌ థాప్సన్‌.

Comments

comments