Search
Sunday 23 September 2018
  • :
  • :

‘ఆసరా’లో భారీగా అక్రమాలు

 అనర్హులకు పింఛన్లు

 రూ. 48,19,920 దుర్వినియోగం
 ప్రజా వేదికలో బయట పడ్డ అక్రమాలు
ముథోల్ : ప్రభుత్వం అర్హులకు ఆసరా పథకం ద్వారా ఆదుకోవాలన్న ఉద్దేశ్యంతో ప్రవేశపెట్టినప్పటికీ ముథోల్ మండలంలో అనర్హులకు పింఛన్‌లు మంజూరు చేసిన వైనం వెలుగు చూసింది. సామాజిక తనిఖీ మండలంలో నిర్వహించడంతో ఏకంగా 1,245 పింఛన్‌లు అనర్హులకు అందాయని వెల్లడైంది. అక్షరాల 48 లక్షల 19 వేల 920 అనర్హుల చేతిలోకి వెళ్లిపోయాయి. ప్రజావేదికల్లో వెల్లడించిన పూర్తి వివరాలు ఆలస్యంగా బుధవారం సాయంత్రం బయ ట పడ్డాయి.ముథోల్ మండలంలో 8, 575 పింఛన్లున్నాయి. ఇందులో 1,245 పింఛ న్‌లు అనర్హులకు ఇచ్చారని సామాజిక తని ఖీ బృందం గుర్తించింది.

ఇందులో 537 వృద్దాప్య పింఛన్‌లు, 387 వితంతువు పింఛన్‌లు, 258 భీడి కార్మికుల జీవన భృతి, 55 వికలాంగుల, 8 గీతా కార్మికుల పింఛన్‌లు అనర్హులని తేలింది. అర్హులకు పింఛన్‌లు మంజూరు చేయాల్సి ఉండగా అనర్హులకు పింఛన్‌లు అందడం చర్చనీయాంశంగా మారింది. ఇందులో భర్త చనిపోయిన భార్యకు వితంతువు కింద పింఛన్ రావాలి. అయితే భర్త బతికి ఉండగానే వితంతువు ఫించన్ పొందిన వారు ఉన్నారు. అలాగే వయస్సు తక్కువగా ఉండటం, భూమి ఎక్కువగా ఉన్న వారికి పింఛన్‌లు మంజూరు చేశారు. జీవన భృతి పిఎఫ్ లేని వారు

Comments

comments