Search
Tuesday 13 November 2018
  • :
  • :
Latest News

నేను బతికుండేది ఏడాదో రెండేళ్లో…

Irrfan Khan talked about his life

ముంబయి: తాను బతికుండేది కొన్ని నెలలు.. లేదంటే ఏడాది, మహా అయితే రెండేళ్లు బతుకుతానేమో, ఈ విషయాన్నినా మెదడు నాకు నిత్యం చెబుతోంది అంటున్నాడు బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ ఖాన్ చెప్తున్నాడు. ఇర్ఫాన్ ఖాన్ న్యూరో ఎండోక్రిన్ ట్యూమర్ తో బాధపడుతున్నసంగతి తెలిసిందే. ప్రస్తుతం లండన్ లో ఆయన చికిత్స పొందుతున్నాడు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు. తాను బతికుండేది కొన్ని నెలలు మాత్రమేనంటూ ఆవేదన పడ్డారు. ఇకపై, ఇలాంటి మాటలు మాట్లాడను.! నాకు మిగిలిన జీవితాన్నిసంతోషంగా గడుపుతానని చెబుతున్నారు. ఇప్పుడు తనకు కీమో థెరపీ నాలుగు సైకిల్స్ పూర్తయ్యాయని ఆయన పేర్కొన్నారు. ఇంకా రెండు సైకిల్స్ పూర్తి కావాల్సి ఉందన్నారు. తనకు మొత్తం 6 సైకిల్స్ పూర్తయ్యాక స్కాన్ చేయాల్సి ఉంటుందని చెప్పారు. అనంతరం ఏం చేయాలనేది తెలుస్తుందని ఇర్ఫాన్ ఖాన్ పేర్కొన్నారు.

Comments

comments