Home కరీంనగర్ వర్షకాలంలో సాగునీరు

వర్షకాలంలో సాగునీరు

Itela-Rajendar-image

రాష్ట్ర ఆర్థిక, పౌర సరఫరాల శాఖ మంత్రి ఈటల రాజేందర్

మనతెలంగాణ/కరీంనగర్‌: శ్రీపాద, ఎల్లంపల్లి ప్రాజెక్టు పనులను పూర్తి చేసివర్షాకాలంలోపు గ్రామాలకు నీరు అందిస్తామని రాష్ట్ర ఆర్థిక, పౌర సరఫరాల శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. కరీంనగర్‌లోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో శ్రీపాద,ఎల్లంపల్లి ప్రాజెక్టు, మిడ్ మానేరు ప్రాజెక్టుల భూ సేకరణ పనులు ప్రగతిపై అధికారులతో సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రాజెక్టు పనులు 80,90 శాతం పనులు పూ ర్తి అయ్యాయని అన్నారు.భూ సేకరణకు నిధులు కరీంనగర్‌కు 26కోట్లు, జగిత్యాలకు 20 కోట్లు వెంటనే విడుదల చేస్తామనిహామీ ఇచ్చారు.ప్రతి రోజు ప్రాజెక్టు ఇంజనీర్లు, భూ సేకరణ అధికారులు, జిల్లా కలెక్టర్లు పనులు చేసే ఏజెన్సీలతో వాట్సప్ గ్రూప్ ఏర్పాటు చేసి సమీక్షించుకోవాలని సూచించారు. ప్రత్యేక కో-ఆర్డినేటింగ్ ఆఫీసర్‌ను నియమించాలని ఆదేశించారు. మొత్తం తెలంగాణ రాష్ట్రంలోని గోదావరి జలాలు పారే మొదటి జిల్లా కరీంనగర్ ఉమ్మడి జిల్లా అని, కరీంనగర్ వాటర్ హబ్‌గా తయారవుతుందని అన్నా రు. కరీంనగర్ జిల్లాలో నిర్మించు కాళేశ్వరం, ఎల్లంపల్లి, మిడ్ మానేరు ప్రాజెక్టుల ద్వారా మెట్ట ప్రాంతాలు, ఆయక ట్టు ప్రాంతం మొత్తం భూమి గోదావరి జలాలతో సాగులో కి వస్తుందని తద్వారా తెలంగాణలో కరీంనగర్ ధాన్యాగారంగా మారుతుందని అన్నారు.
కరీంనగర్ జిల్లా విత్తన భాండాగారంగా అవతరించనున్నదని అన్నారు.ఈ సమావేశంలో పార్లమెంట్ సభ్యులు బోయినిపల్లి వినోద్‌కుమార్, జిల్లా కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మ ద్, ఐడిసి చైర్మన్ ఈద శంకర్ రెడ్డి, నగర మేయర్ సర్ధార్ రవీందర్ సింగ్, డిప్యూటీ మేయర్ గుగ్గిళ్ళపు రమేష్, గ్రం థాలయ చైర్మన్ ఏనుగు రవీందర్‌రెడ్డి, శ్రీపాద,ఎల్లంపల్లిప్రాజెక్టు ఎస్‌ఇ విజయ భాస్కర్‌రావు, కరీంనగర్,హుజురాబాద్ ఆర్డీఓలు రాజాగౌడ్, చెన్నయ్య, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ వెంకట మాధవరావు, రోడ్లు భవనాల శాఖ ఇఈ రాఘవచారి, పంచాయతీరాజ్, ఇరిగేషన్ ఇంజనీర్లు, తహసీల్దార్లు, తదితరులు పాల్గొన్నారు.