Search
Sunday 23 September 2018
  • :
  • :

ట్రాక్టర్ నడిపిన మంత్రి హరీశ్‌రావు

Harish-rao

సిద్దిపేట: జిల్లాలోని నంగునూరు మండలం మిషన్ కాకతీయ ఫేజ్-4 పనులను మంత్రి హరీశ్ రావు ప్రారంభించారు. గట్లమల్యాల గ్రామానికి వచ్చిన మంత్రి కి గ్రామస్థులు ఘన స్వాగతం పలికారు. హరీశ్‌రావును చెరువు దగ్గరకి తీసుకెళ్లేందుకు ట్రాక్టర్లతో భారీ ర్యాలీ నిర్వహించారు. కాగా… మంత్రి స్వయంగా నాలుగు కిలోమీటర్లు ట్రాక్టర్ నడుపుకుంటూ చెరువు కట్ట వద్దకు వెళ్లి, అక్కడి నుంచి కట్ట పొడవునా కిలో మీటరు మేర నడిచి వెళ్లి కట్టమైసమ్మకు పూజలు చేసి చెరువు పునరుద్ధరణ పనులు ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ఉమ్మడి మెదక్ జిల్లా సాగునీటి పారుదల శాఖ ఎస్‌ఇ పద్మారావు, ఇఇ రవీందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Comments

comments