Home జాతీయ వార్తలు మిగిలిన నీటిని తీసుకోండి : హరీష్‌రావు

మిగిలిన నీటిని తీసుకోండి : హరీష్‌రావు

Irrigation Minister Harish Rao participated in the NWDA meeting

న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ సారథ్యంలో జాతీయ నీటి అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నదుల అనుసంధానంపై సోమవారం ఢిల్లీలో సుదీర్ఘ చర్చ జరిగింది. ఈ సమావేశానికి తెలంగాణ తరపున నీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు హాజరయ్యారు. సమావేశం ముగిసిన తరువాత హరీష్‌రావు మీడియాతో మాట్లాడుతూ… నదుల అనుసంధానంపై టిఆర్ఎస్ ప్రభుత్వం తరపున తమ అభిప్రాయాన్ని చెప్పామన్నారు. తెలంగాణ అవసరాలు తీర్చిన అనంతరం మిగిలిన నీటిని తీసుకోవడంలో తమకు ఎటువంటి అభ్యంతరం లేదని మంత్రి పేర్కొన్నారు. రాష్ట్రానికి కేటాయించిన 954 టిఎంసిల నిరకజలాలు పోనూ మిగిలిని నీటిని తీసుమన్నారు. తమ ప్రాజెక్టులకు హైడ్రాలజీ క్లియరెన్స్ ఇవ్వకుండ నదుల అనుసంధానించడానికి డిపిఆర్ తయారు చేయడాన్నిమంత్రి హరీష్ గట్టిగా వ్యతిరేకించారు. తెలంగాణ, ఎపికు కేటాయింపులు జరిగిన తర్వాత నదుల అనుసంధానంపై ఆలోచించాలని  మంత్రి తెలిపారు. ఈ అంశాన్ని రాతపూర్వకంగా కేంద్రమంత్రి నితిన్ గడ్కరీకి అందించామని హరీష్ స్పష్టం చేశారు. సీతారామ ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని అనుమతులు తొందరగా ఇవ్వాలని కోరామన్నారు. జాతీయ హోదా ఏ ప్రాజెక్టులకు ఇవ్వడం లేదని పార్లమెంట్‌లో కేంద్ర మంత్రి చెప్పారు, కానీ 60:40 నిష్పత్తిలో గ్రాంట్లు ఇస్తామని చెప్పిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. మహారాష్ట్రలో కొన్ని ప్రాజెక్టులకు గ్రాంట్లు ఇచ్చారు. అదే విధంగా తెలంగాణ రాష్ట్రానికి గ్రాంట్లు ఇవ్వాలని మంత్రి హరీష్ కోరామని చెప్పారు.