Home అంతర్జాతీయ వార్తలు పాకిస్థాన్‌లో ఉన్నవారందరూ నిజాయతీపరులా? : నవాజ్

పాకిస్థాన్‌లో ఉన్నవారందరూ నిజాయతీపరులా? : నవాజ్

nawazshareef

ఇస్లామాబాద్ : పనామా గేట్‌ కుంభకోణం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న పాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ సంచలనాత్మక వ్యాఖ్యలు చేశారు. ఈ కుంభకోణంలో నవాజ్ షరీఫ్ తో పాటు ఆయన కుటుంబ సభ్యులను సైతం ఆ దేశ సుప్రీం కోర్టు నిందితులుగా ప్రకటించడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘నా కుటుంబాన్ని కావాలనే టార్గెట్ చేస్తున్నారు. పాకిస్థాన్ లో ఉన్నవారందరూ నిజాయతీగా, సత్యసందతగా ఉన్నారా..? అని ఆయన ప్రశ్నించారు.