Home కుమ్రం భీం ఆసిఫాబాద్ తండాలు పంచాయతీలుగా మారడం కలేనా?

తండాలు పంచాయతీలుగా మారడం కలేనా?

Tanda-Panchayatఆసిఫాబాద్: మాగూడెం… మారాజ్యం అనే నినాదంతో గిరిజనులు ఎంతో కాలంగా తండాలను పంచాయితీలుగా మార్చాలని డిమాండ్ చేస్తు న్నారు. నాలుగు దశ్దాలుగా గోండులు,కోలములు,లాంబడిలు ఇందుకోసం ఉద్యమి స్తున్నారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమం సాగుతున్న సమయంలో టిఆర్‌ఎస్ నాయ కత్వం ప్రతి వేదికపై 500 జనాభా కల్గిన గిరిజన తండాలను పంచాయితీలుగా మారుస్తామని పదేపదే ప్రస్తావించారు. కానీ అధికారంలోకి వచ్చాక ఆ ఊసే ఎత్తక పోవడంతో గిరిజనులు అసంతృప్తికి లోను అవుతున్నారు. 2014 ఎన్నికల సమయం లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించిన ముఖ్యమంత్రి కేసిఆర్ స్వయంగా తండాల రూపురేఖలు మారుస్తానని ప్రజల్లో ఆశలు పుట్టించారు. అధికారంలోకి వస్తే తండాలను పంచాయితీలుగా ఏర్పాటు చేస్తామంటూ హామి ఇచ్చారు. దీంతో అప్పటి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పంచాయితీ శాఖ సిబ్బంది జిల్లాలో గిరిజనులు అధికంగా నివాసిస్తున్న గ్రామాలు,జనాభా ప్రాతిపదిక లెక్కలు చేశారు. అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 800 పైన పంచాయితీలను పునర్ వ్యవస్దీకరించి వాటి నుంచి 200 గిరిజన గూడలను గ్రామపంచాయితీలుగా ఏర్పాటు చేసేందుకు ప్రాతిపదనలు తయారు చేసి ప్రభుత్వానికి నివేదికపంపించారు. ఇంత వరకు బాగానే ఉన్న రాష్ట్ర ప్రభుత్వం జిల్లాల పునర్ వ్యవస్దీకరణకు పెద్దపీట వేసి పంచాయితీల ఏర్పాటు ఊసే ఎత్తకపోవడంతో ప్రభుత్వం ఇచ్చిన హామిలు లెక్కలేకుండా పోయాయి. పంచాయితీ ఎన్నికలు పట్టుమని ఏడాది కాలం లేకపోవడంతో ఇది సాధ్యమయ్యే పని కాదని విశ్లేషకులు భావిస్తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మొత్తం 200 తండాలను పంచాయితీలుగా ప్రాతిపదినలు అధికారులు తయారు చేశారు. కాగా జిల్లా పునర్ వ్యవస్దీకరణ తర్వాత అందుబాటులో ఉన్న గణాంకాల ప్రకారం కోమురం భీం, ఆసిఫాబాద్ జిల్లాలో ప్రభుత్వం కార్యరూపం దాలుస్తే నూతనంగా 47 గ్రామ పంచా యితీలు ఏర్పాటు కానున్నాయి. కానీ తెలంగాణ ప్రభుత్వం దాని పై అంతగా దృష్టి సారించకపోవడంతో ఇక్కట్లు, ఈ హామిలు నేరవేరడం కనిపించడంలేదు. తండలలో అనేక సమస్యలు రాజ్యమేలుతున్నాయి. కనీస వసతులు లేక గిరిజనులు ఇబ్బందులు పడుతున్నారు.
చాల తండాలలో రోడ్లు,డ్రైనేజీలు లేవు. అలాగే పాఠశాలలు కూడ సరిగా లేక అక్కడి పిల్లలు చదువులకు దూరం అవుతున్నారు. కెరమెరి మండలంలోని కోలంగూడ మండలంలో రోడ్లు,త్రాగునీటి వసతులు లేకగిరిజనులు చాల ఇబ్బందులు ఎదుర్కొం టున్నారు. కమ్యూనిటి భవన్,గ్రామపంచాయితీ భవనం లేక ఏ సమావేశమైన చెట్ల క్రింద నిర్వహించుకుంటున్నారు. అదే తండాలను గ్రామ పంచాయితీగా మారిస్తే గిరిజనుల రూపురేఖలు మారుతాయని వారు ఆశిస్తున్నారు.