Home మహబూబ్‌నగర్ కాంగ్రెస్ నేతలను పెద్ద చెరువులో ముంచండి

కాంగ్రెస్ నేతలను పెద్ద చెరువులో ముంచండి

Is not Congress leaders blocking projects?

పాలమూరుకు శాపగ్రస్తులు వారే                                                                                                                            జిల్లా అభివృద్ధికి ప్రథమ శత్రవు కాంగ్రెస్సే                                                                                                                ఐటిహబ్ భవనానికి రూ.50 కోట్లు                                                                                                                      నెక్లెస్ రోడ్డుకు రూ.24 కోట్లు మంజూరు                                                                                                                ఎంబిఎన్‌ఆర్, జడ్చర్ల రహదారికి రాష్ట్ర నిధులు ఇస్తాం                                                                                                  నిరంతర శ్రామికుడు ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్                                                                                                            ప్రాజెక్టులను అడ్డుకుంది కాంగ్రెస్ నేతలు కాదా ?                                                                                                      కాంగ్రెస్‌ను తిట్టిన నాగమే తిరిగి కాంగ్రెస్‌ను పొగుడుతాడా                                                                                        ఎన్ని పార్టీల్లో మారుతాడో ఆయనకే తెలియాలి                                                                                                          పక్కనే కిందికి నీళ్లు పోతుంటే హంద్రీనీవాకు హారతి పట్టిన డికె అరుణ                                                                        ఎంపిగా ఉండి జైపాల్‌రెడ్డి పాలమూరుకు ఏమి సాధించారు                                                                                        దశాబ్దాల పాలనలో పాలమూరుకు చేసింది శూన్యమే                                                                                                బహిరంగ సభలో నిప్పులు చెరిగిన రాష్ట్ర మంత్రి కెటిఆర్

మన తెలంగాణ/మహబూబ్‌నగర్ : పక్కన మెడికల్ కళాశాల అటు వైపు అందమైన మయూరి పార్కు, ఇటు వైపు కర్వేనా రిజర్వాయర్, ఇక్కడికి చేరువలోనే 44వ జాతీయ రహదారి, ఇప్పడు ఇక్కడే ఐటి హబ్ మహబూబ్‌నగర్ పట్టణానికి చేరువలోనే ఇంత అభివృద్ధి జరుగుతోంది. మహబూబ్‌నగర్ పట్టణానికి గతంలో 14 రోజులకు ఒకసారి తాగనీరు ఇప్పడు రెండు రోజులకు ఒక సారి నీళ్లిస్తున్నాం త్వరలో మిషన్ బగీరథ ద్వారా రోజూ నీరిస్తాం. ఒకప్పడు పెద్ద చెరువు చూస్తే పందులు, కుక్కలు చనిపోయి పిల్లల శవాలు కూడా అక్కడే ఉండి దుర్గందంతో ఉండేది. ఇప్పడు చూడండి హైదరాబాద్‌లో ట్యాంక్ బండ్‌ను మించిన స్థాయిలో మిని ట్యాంక్ బండ్ నిర్మాణం జరుగుతోంది. ఇంత అభివృద్ధి ఎప్పుడైనా చూశారా. కాంగ్రెస్ వారు 50 సంవత్సరాలు పరిపాలించారు. వలసలు పోలేదు. అది చే శాం. ఇది చేశాం. అంటున్నారు. టిఆర్‌ఎస్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి కెసిఆర్ అధికారంలోకి వచ్చిన నాలుగేళ్లలోనే ఇంత అభివృద్ధి చేశాం. 50 ఏళ్లు టిఆర్‌ఎస్‌కు అధికారమిస్తే ఇక ఎంత అభివృద్ధి జరుగుతుందో ఊహించుకోవాలని కెటిఆర్ అన్నారు.

అన్న శీనన్న నిరంతర శ్రామిక వాది :
మీ ఎమ్మెల్యే నిరంతర శ్రామికుడు. గంటలో హైదరాబాద్‌లో ఉంటే, మరో గంటలో మహబూబ్‌నగర్‌లో ఉంటాడు. లేక పోతే ఏ కార్మికుల సంఘాలతో ఉంటాడు. నిత్యం మహబూబ్‌నగర్ నియోజకవర్గ అభివృద్ధి పైన ధ్యాస పెడ్తాడు. అలాంటి మీ ఎమ్మెల్యే ఉండడం వలనే ఇంత పెద్ద ఎత్తున మహబూబ్‌నగర్ అభివృద్ధి సాధ్యమైంది. ఇప్పడు ఐటి కారిడార్‌తో మరింత అభివృద్ధి దిశగా పరుగులు పెట్టడం ఖాయంగా కనిపిస్తోంటూ మంత్రి కెటిఆర్ కాంగ్రెస్ నేతలపై ఘాటుగా విమర్శలు చేస్తూనే ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ చేసిన సేవలను కొనియాడారు. శనివారం ఆయన జిల్లా పర్యటనలో భాగంగా జాతీయ రహదారికి దగ్గరలో ఉన్న దివిటి పల్లె వద్ద ఐటి, మల్టిపర్పస్ పారిశ్రామిక కారిడార్ పైలాన్‌కు శంకుస్థాపన చేశారు. అనంతరం పెద్ద ఎత్తున హాజరైన కళాశాల యువత, మహిళలతో జరిగిన భారీ బహిరంగ సభలో కెటిఆర్ కాంగ్రెస్ నేతలను చీల్చి చెండాడారు. టిఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ది పనులు శరవేంగా జరుగుతున్నాయని చెప్పారు. టిఆర్‌ఎస్ ప్రభు త్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాల, మౌళిక సదుపాయాలు, సాగునీరు, తాగునీరు, విద్య వైద్యం వంటి అభివృద్ధితో కాంగ్రెస్ నేతలకు దిమ్మ దిరిగి ఉనికి కోసం పాకులాడుతున్నారని ధ్వజమెత్తారు.

పాలమూరుకు శాపం కాంగ్రెస్ :
ఇవాళ పాలమూరు లేబర్‌లు ఉన్నారంటే దానికి కారణం 60 ఏళ్లు పాలించిన కాంగ్రెస్ వాళ్ల …? లేకా నాలుగేళ్లు పరిపాలించిన మేమా.. ఒక్క సారి ఆలోచించండి. ఇవాళ వారు ఏమీ మాట్లాడుతున్నారో చూడండి. పెద్దపెద్ద మాటలు అదెందుకు కాలేదు.. ఇదెందుకు కాలేదు.. మేము ఇది చేసినాం.. అది చేసినాం… అంటున్నారు. పాలమూరుకు శాపం బయ టి వారు కాదు. బయటి నుంచి వచ్చి మనల్ని ఇబ్బంది పెట్టి న వారు కాదు. చంద్రబాబు నాయుడు వచ్చి పాలమూరు జిల్లాను దత్తత తీసుకుంటామని చెప్పి ఏమీ చేయకపోవచ్చు. వైస్ రాజేశేఖర్‌రెడ్డి మన కృష్ణా నీళ్లను రాయలసీమలోనే పోతిరెడ్డిపాడుకు తీసుకెళ్లి పోవచ్చు. ఆయన ప్రాంతంపై ఆయనకు ప్రేమ ఉండవచ్చు. కానీ పాలమూరుకు ప్రథమ శత్రువులు, పాలమూరును శిథిలం చేసింది దశాబ్ధాల పాటు ఈ జిల్లాను వంచించింది ఈ జిల్లాలోని కాంగ్రెస్ నేతలు కాదా అని రాష్ట్ర ఐటి శాఖ మంత్రి కె. తారకరామారావు జిల్లా కాంగ్రెస్ నేతలపై ఘాటుగా నిలదీశారు. ఒకాయన పెద్దయాన కేంద్ర మంత్రిగా పని చేశారు. పెద్దపెద్ద పదవులు దశాబ్దాల పాటు చేశారు. తెలంగాణ కావాలని పోరాటం చేసినప్పుడు ఆయన నేను తెలంగాణ వాదిని కాదు అదేవిధంగా సమైఖ్యవాదిని కాదు, జాతీయ వాదిని చెప్పి డైలాగ్‌లతో తప్పించుకొని తిరిగాడు తప్పా పదవిని వదిలిపెట్టలేదని జైపాల్‌రెడ్డిపై కేటీఆర్ ఫైర్ అయ్యారు. కేంద్ర మంత్రిగా ఉం డి పాలమూరు ప్రత్యేకంగా ఆయన చేసింది ఏమీ లేదని దుయ్యబట్టారు. అల్లికి అల్లి సున్నకు సున్న చేసి పాలమూరు జిల్లా అభివృద్ధికి కోసం ఏమాత్రం కష్టపడలేదని విమర్శించారు. పక్కనే ఉన్న మరో శాసనసభ్యురాలు నిన్నటి దాక మంత్రిగా ఉన్న డికె. అరుణ కృష్ణా నది నుంచి కిందకి నీళ్లు తీసుకెళ్తుంటే ఎందుకు ప్రశ్నించలేదని నిలదీశారు. పైగా హంద్రీనీవాకు డికె.అరుణ హారతి పట్టి తెలంగాణకు తీవ్ర ద్రోహం చేసి ఇప్పుడు వచ్చి పెడబొబ్బలు పెడుతోందని విమర్శించారు. నిన్నమొన్నటి దాకా ఎన్నో పార్టీలు మారిన మరొ క నాయకుడు వైఎస్ రాజశేఖర్‌రెడ్డి బతికి ఉన్నప్పుడు ఆయనను తిట్టి, జలయజ్ఞం కాదు ఇది ధనయజ్ఞం అంటూ తిట్టాడని, తిరిగి ఇప్పుడు బియ్యం, పప్పులు తిన్న గుర్తులు గుర్తోయామో కానీ, వైస్ రాజశేఖర్‌రెడ్డిని మంచోడంటూ పొగడుతున్నాడని నాగంనుద్దేశించి వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ జలయజ్ఞం పేరుతో కాంట్రాక్టర్లు కమీషన్లు తిన్నారని ఇదే నాగం జనార్థన్‌రెడ్డి ఆరోపించి ఇప్పుడు వారి అలవాట్ల ను తమపైకి రుద్దే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. తమ పార్టీలో కమీషన్లు తినే సంస్కృతి లేదని, అది కాంగ్రెస్ పార్టీ సంస్కృతి అని విమర్శించరు. దశాబ్ధాల పాటు అధికా రం చేపట్టిన కాంగ్రెస్ ముఠా ఇప్పుడు అడుగడుగునా జిల్లా లో జరుగుతున్న అభివృద్ధిని అడ్డుకుంటున్నారని విమర్శించారు. పాలమూరు పోరుగట్టు మీద నుంచి సవాల్ చేస్తున్నా పాలమూరు ఎత్తిపోతల పథకానికి వ్యతిరేకంగా కోర్టులో కేసులు వేసింది దేవరకద్ర కాంగ్రెస్ నేత పవన్‌కుమార్‌రెడ్డి , కొల్లాపూర్ కాంగ్రెస్ నాయకుడు హర్షవర్ధన్‌రెడ్డి లు రెడ్డిలు కాదా అని నిలదీశారు. పాలమూరు రైతు నోట్లో మట్టి కొట్టే విధంగా పాలమూరు రైతులకు కష్టాలు కలకాలం ఉండే విధంగా పాజెక్టుల నిర్మాణం జరగకుండా కాంగ్రెస్ నాయకుల చెప్పు చేతుల్లో రైతాంగం ఉండేలా కుట్రలకు పాల్పడాలన్న కసితోనే ప్రాజెక్టులకు కాంగ్రెస్ నాయకులు అడ్డుకుంటున్నారని ఆక్షేపించారు. పాలమూరు రంగారెడ్డి పథకం ముందుకు సాగకుండా కోర్టుకు వెళ్లి స్టేలు తీసుకొస్తున్నారని తెలిపారు. కొల్లాపూర్ అభయారణ్యంలో పులలు, సింహ్మాలు ఉన్నాయంటూ పర్యవరణానికి హాని కలుగుతుందంటూ అభూత కల్పనలు చెప్పి కోర్టుల నుంచి స్టేలు తీసుకొచ్చి ప్రాజెక్టు పనులు జరగకుండా కాంగ్రెస్ నాయకులు కేసుల మీద కేసుల వేస్తున్నారని కేటీఆర్ ధ్వజమెత్తారు. ఇలాంటి అరచాకాలతో కాంగ్రెస్ ప్రాజెక్టులను ఆపుతోందని విమర్శించారు.

బంగారు తెలంగాణకు కృషి చేస్తున్న సిఎం : ఎంపి జితేందర్‌రెడ్డి
సాధించుకున్న తెలంగాణా రాష్ట్రంలో బంగారు తెలంగాణా దిశగా ముఖ్యమంత్రి కెసిఆర్ కృషి చేస్తున్నాడని ఎంపి జితేందర్‌రెడ్డి అన్నారు. ఐటి హబ్‌తో విదేశీ కంపెనీలు ఇక్కడికి వచ్చే అవకాశాలు ఉన్నాయని, వాటి వలన ఇక్కడి నిరుద్యోగ యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగాలు వస్తాయని చెప్పారు. జడ్చర్ల, మహబూబ్‌నగర్ రహదారి జాతీయ రహదారి పరిధిలో ఉన్నందున కేంద్రం చిన్న చూపు చూస్తోందన్నారు. పార్లమెంట్ సమావేశాల్లో అనేక మార్లు ప్రస్తావించినా పరిస్కరించలేదని చెప్పారు. బిజెపి ఎంపి ఉంటేనే ఆ రోడ్డుకు నిధులు ఇస్తామంటూ బిజెపి ఎంపి చెప్పడం విడ్డూరమని చెప్పారు. కేంద్రం చేతకాక పోతే తమ ముఖ్యమంత్రి ద్వారా వేసుకుంటామన్నారు. ఐటి హబ్ వేలాది మందికి ఉపాధినిస్తుందన్నారు.

కర్వేన ప్రాజెక్టుతో 7500 ఎకరాలకు సాగునీరు : మంత్రి లకా్ష్మరెడ్డి
జడ్చర్ల వద్ద ఉన్న పోలే పల్లె సెజ్‌పై మొదట్లో కొందరు వ్యతిరేకించినా తన కృషితో ఏర్పాటు చేశానని కాని, ఇప్పడు అక్కడ పరిశ్రమలు వచ్చి సుమారు 20 వేల మందికి ఉద్యోగ, ఉపాధి లభిస్తందని చెప్పారు. ఇప్పడు ఈ ఐటి హబ్ ద్వార వేలాది మందికి ఉపాధి, ఉద్యోగాలు వస్తాయని ఆయన చెప్పారు. ముఖ్యమంత్రి కెసిఆర్ అభివృద్దికి కృషి చేస్తూ బంగారు తెలంగాణ దిశగా ముందుకు సాగుతున్నారని చెప్పారు. కాంగ్రెస్ నేతలకు కమీషన్ల దబ్బుల తప్ప అభివృద్ది గురించి ఎప్పడు పని చేయలేదని ఆరోపించారు.

పాలమూరు అభవృద్ధికి కృషి చేస్తే కేసులు వేస్తారా ? : ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్
సమైఖ్య ఆంద్ర రాష్ట్రంలో పాలమూరు ఎంతో అన్యాయం, వివక్షతకు గురైందని, ఇక్కడ వలసలు,కన్నీళ్లు మిగిలాయన్నారు. ఎంపిగా గెలిచిన సిఎం కెసిఆర్ అనుకున్న విధంగానే మొదటి రోజే పాలమూరు జిల్లాకు పాలమూరు రంగారెడ్డి సాగునీటి ప్రాజెక్టును మంజూరు చేయడంతో పాటు అనేక అభివృద్ది పనులకు కృషి చేస్తున్నాడని చెప్పారు.పాలమూరు నియోజకవర్గ అభివృద్ది ఏ కాంగ్రెస్ నేత చేయలేదని ద్వజమెత్తారు. తాను ఎమ్మెల్యే అయిన తర్వాత రాష్ట్రంలోనే 300 ఎకరాల్లో రాష్ట్రంలో పెద్ద పార్కుగా మయూరి పార్కును తీర్చిదిద్దినట్లు చెప్పారు. పెద్ద చెరువు, రోడ్లు, మెడికల్ కళశాల,ఆసుపత్రి, ఐటి హబ్, రోజు రోజు విడిచి రోజు తాగునీరు , ఎన్నో అభివృద్ది పనులు చేపట్టినట్లు ఆయన చెప్పారు. ఐటి హబ్‌కు సహాకరించిన సిఎం కెసిఆర్‌కు,మంత్రి కెటిఆర్‌కు ఈ సందర్భంగా కృతజ్ఞతులు చెప్పారు. ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, గువ్వల బాల్‌రాజు, చిట్టెం రామ్మోహన్‌రెడ్డి, జడ్పీ చైర్మన్ బండారి భాస్కర్, జిల్లా కలెక్టర్ రోనాల్డ్ రోస్, మున్సిపల్ చైర్మన్ రాధాఅమర్ తదితర నేతలు పాల్గొన్నారు.