Search
Wednesday 14 November 2018
  • :
  • :

తిన్నా సుఖం లేదా?

Eating-Food

చాలామందికి తిన్న వెంటనే నిద్రపోవాలనిపిస్తుంటుంది. దాంతో పాటు అలసట, నీరసం కూడా ఉంటుంది. ఈ లక్షణాలు కనపడగానే మధుమేహానికి దారితీస్తుందోనని భయపడుతుంటారు. కానీ కొందరిలో భోజనం చేయగానే ఎలాంటి కారణాలు లేకుంనే రక్తంలో చక్కెర స్థాయులు పడిపోయిన మాదిరిగా లక్షణాలు కనబడుతాయి. దీన్నే ‘ఇడియోపతిక్ పోస్ట్-పాండ్రియల్ హైపోగ్లైసీమియా’ (ఐపీఎస్) అంటారు. పిండి పదార్థం అధికంగా గల పదార్థాలు తినటం మూలంగా ఇది పెరుగుతూ ఉంటుంది. అయితే, వీరికి రక్తపరీక్ష చేస్తే గ్లూకోజు స్థాయులు మామూలుగానే ఉంటాయి.
దీంతో కాళ్లు చేతులు వణకటం, ఆందోళన, చెమట, చలి, చిరాకు, చూపు మసకబారటం వంటి లక్షణాలు కనబడతాయి. అయితే, ఐపీఎస్ ఎందుకొస్తుందనేది కచ్చితంగా చెప్పలేం. గ్లూకోజు స్థాయులు మామూలుగా ఉన్న సమయంలో ఎపినెఫ్రిన్ అనే హార్మోన్ (అడ్రినలిన్) రక్తంలోకి పెద్దమొత్తంలో విడుదల కావటం వల్ల ఇలాంటి పరిస్థితి వస్తుందని పలువురు ఆరోగ్య నిపుణులు అనుమానిస్తున్నారు. జీవనశైలిని మార్చుకోవటం ద్వారా దీనిని కంట్రోల్ చేయొచ్చు. చక్కెర ఎక్కువగా ఉండే పానీయాలు, శుద్ధిచేసిన పిండి పదార్థాలను తక్కువ తీసుకోవాలి. ఇలాంటి లక్షణాలు ఉన్న వారు ఆకుకూరలు, పండ్లు, పొట్టుతీయని ధాన్యాలు, పప్పుల వంటి పీచు అధికంగా ఉండే పదార్థాలు.. తేలికైన ప్రోటీన్ ఉన్న పదార్థాలను తీసుకోవడం మంచిది.

Comments

comments