Home ఎడిటోరియల్ ఇదేనా సిలబస్!

ఇదేనా సిలబస్!

telanganaవిద్యాప్రమాణాలను గురించి ఎంత తక్కువగా మాట్లాడు కుంటే అంతమంచిది అన్నట్లుంటోంది. మొన్న మధ్యాహ్నం ‘స్టార్ మహిళ’ ఛానల్ ప్రోగ్రాం లో పాల్గొన్న స్త్రీలు ఒకరిద్దరు చెప్పిన సమా ధానాలు పాతిక ముప్ఫైఏళ్లవారి అవగాహనా స్థాయి కూడా భాషా సాంస్కృతికంగా ఎంతగానో శోచ నీయంగా వున్నాయని తెలియచేశాయి. పురు షులపేర్లకు ముందు గౌరవ వాచకంగా వుండే అక్షరం ఏమిటో తెలియదు. మహాప్రస్థానం రాసిం దెవరు అన్నదానికి ఛాయిస్ అడిగికూడా సి.నారా యణ రెడ్డి, శ్రీశ్రీ అని పేర్లు చెబితే సినారె అని సమాధానం వచ్చింది.
కాళోజీ జయంతిని సెప్టెంబర్ 9న భాషా దినోత్సవంగా ప్రకటించుకుని వేడుకలు చేసుకోవడం బాగానే ఉందిగానీ భాషను సంరక్షించుకునే, అభి వృద్ధి పరచుకునే దిశగా ఉన్న ప్రణాళికలు ఏమిటి అన్నది స్పష్టం కాలేదు. సిలబస్ మార్చేసుకుంటూ తెలంగాణ అంశాలకు అధికప్రాధాన్యం ఇవ్వాలన్న భావన మంచిదే! ఎవరూ కాదనరు. కానీ ఆ సిలబస్ చదువు కోవడం ద్వారా విద్యార్థుల స్థాయి పెరిగేలా వుండాలి. వానమామలై వరదాచార్యులు, దాశరథి, కాళోజీ, సినారెల పాఠాలు పెట్టడానికీ, నిన్న మొన్నటిగా రచన చేస్తున్న వారి పాఠాలు పెట్టడానికీ తేడాఉంది. అంతేకాదు ముఖ్యంగా పోటీపరీక్షల కోసం తెలంగాణ పబ్లిస్ సర్వీస్ కమీషన్ ముందుకు తెచ్చిన సిలబస్ ఉద్యోగార్థులైన అభ్యర్థులను ఉన్న పళాన సమగ్ర తెలంగాణ అవగాహన పరులై వుండి తీరాలన్న తీరుగా తోస్తోంది.
మూడుగంటల్లో/బహిర్గతం కావాలని/ శాసింప బడిన విజ్ఞానం/విద్యార్థి పరీక్ష… .అన్నట్లుగా తరతరాల తెలంగాణపై భౌగోళిక, రాజకీయ, సామా జిక, సాహిత్యక అంశాలన్నీ ఇప్పటి కిప్పుడు ఆపోసన పట్టాలన్నట్లు నిర్బంధిస్తున్నట్లుండడం విజ్ఞత అని పించుకోదు. పోటీ పరీక్ష ల మొత్తంపై నలభై శాతం మార్కులు తెలంగాణా అంశా లకే కేటాయించడానికి నెల రోజులుపైగా సిలబస్ కూర్చిన మేధావులు గొప్ప మేధో మధనం చేసి నట్లున్న మాట నిజమేగాని అందరూ
కలిసి అభ్యర్థులపై మోపిన భారం సంగతి ఎవరూ ఆలోచిస్తున్నట్లు లేదు. పోటీపరీక్షల సిలబస్ రూపొం దించడంలో అభ్యర్థుల విద్యాస్థాయి ప్రమాణాలను ఈ మేధావులు ఏ మేరకు పట్టించుకున్నారన్నది సందే హంగా వుంది. ఎవరి అభిరుచులను, అభీష్టాల ను, తమతమ పరిజ్ఞానాలను సిలబస్ రూపకర్తలు అభ్య ర్థులపై మోపుతున్నట్లు గాక ఇంతవరకు వారు పాఠశాల నుంచి కళాశాలవరకు చదివిన అంశాలను ఒక్క సారిగా పక్కనబెట్టి రాత్రికి రాత్రి తెలంగాణ అం శాలను సమగ్రంగా అధ్యయనం చేయాలన్న ట్లు గా ఇంత తక్కువ వ్యవధినిస్తూ శాసించడం ఔచిత్యం కాజా లదు.
ఇప్పుడిప్పుడే పాఠశాల స్థాయినుంచి పాఠ్య ప్రణాళికలో తెలంగాణ అంశాలు ప్రాధాన్యత సంత రించు కుంటున్నాయి. కొత్తసిలబస్‌ను ఆత్మ గౌరవం తో చదువుకోవడం మొదలయింది. పోటీ పరీక్షల సిలబస్‌లో అప్పుడే తెలంగాణ అంశాల సమ్రగ అధ్యయనం కావాలనడం, అందు లోనూ ‘హార్డ్‌కోర్’ విషయాలను చేర్చడం కాకుండా, పరిశోధ న చేసి తీరాల్సిన అంశా లతో కాకుండా జన బాహు ళ్యంలో ప్రసిద్ధమై వున్న రాజకీయ, ఉద్యమ గత, సాహిత్య సాంస్కృతి కాంశా లను మాత్ర మే ప్రశ్నలుగా ప్రస్తుతా నికి జత పరుస్తూ టీపీఎస్సీ తెలంగాణ పరిశోధనా త్మక అంశాలను సగానికి కుదించా లని అభ్యర్థులు కోరుకోవడంలో తప్పులేదు.
తెలంగాణ ప్రాంత ఉనికి, ప్రారంభం, ఎల్లలు, వాతావరణ రీతులు, చరిత్ర, నాటినుంచి నేటివరకు సాగిన పాలనావైఖరి, ఉద్యమాలు, వ్యావసాయిక అంశాలు అభ్యర్థులు ఇప్పటికిప్పుడే ఓ ఆరేడు నెలల్లో నే అధ్యయనం చేసి ఆయా విషయాలపట్ల నిష్ణాతులు కావలసిందే అనడం అన్నప్రాశననాడే ఆవకాయ తొక్కు తిన్మన్నట్లే వుంటుంది.
పాల్కురికి సోమనాథుడు, పోతన, కాళోజీ తెలంగాణ కవిత్రయం అని మొన్న ఒక సభలో కె.వి. రమణాచారి గారు పేర్కొన్నారు. తెలంగాణ ప్రాచీన కవులు నుండి దాశరథి, సినారె వంటి అధునాతన కవులు ఎందరో భాష అభివృద్ధికి, వికాసానికి తోడ్ప డిన వారే. బడిపలుకుల భాష కాక పలుకు బడుల భాషను ఉపయుక్తం చేసిన ప్రసిద్ధ నవలా, కథా రచయితలు ఎందరో ఉన్నారు. వారికి సంబం ధించిన అంశాలను తెలుగుసిలబస్‌లో చేర్చడం బాగుంటుందికానీ బొడ్డూడని నిన్నమొన్నటి కుర్రకవుల రచనలు సంకలనాలగురించి సిలబస్‌లో చేర్చడం, రెండోరకం స్థాయి భాషావైదుష్యంగలవారి రచనలను తవ్వి తలకెత్తడం భాషాభివృద్ధికి ఏ విధంగా దోహదపడుతుందో ఆలోచించాలి. సిలబస్ నిర్ణాయకులు వైయక్తిక ఇష్టాలకు అస్మదీయులకు మేలు కూర్చాలనీ, పేరుతేవాలనీ తాపత్రయ పడడం కాకుండా ఆ సిలబస్ తెలంగాణా భాషాభివృద్ధికీ, వికాసానికీ, అభ్యర్థుల విద్యాప్రమాణాల రాణింపు కూ దోహదపడేలా వుండడం చూసుకోవాలి. గురు వుల సిలబస్‌కాక, లఘువుల సిలబస్‌రుద్దితే ప్రమా ణాలు పడిపోవడం ఖాయం! విద్య విజ్ఞాన, వికాసా లను కలిగించాలి.మనిషి సంస్కారాన్ని పెంచాలి. జీవన ప్రమాణాలను, మానవీయ విలువలను ప్రోది చేయాలి. అలాంటి సిలబస్‌ను అందిపుచ్చుకుని అధ్యయనం చేసి విద్యా, ఉద్యోగార్థులు పురోగమించి నప్పుడే అక్షరమైన బంగారు తెలంగాణ సాధ్యం.