Search
Tuesday 25 September 2018
  • :
  • :
Latest News

తెలంగాణ ఉద్యమాన్ని గుర్తు చేసుకోవడం తప్పా..?

Kodandaram

హైదరాబాద్: తెలంగాణ ఉద్యమాన్ని గుర్తు చేసుకోవడం తప్పా అని కెసిఆర్ ప్రభుత్వాన్ని జెఎసి చైర్మన్, ప్రొ. కోదండరామ్ ప్రశ్నించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ…. తెలంగాణ ఉద్యమంలో భాగమైన మిలియన్ మార్చ్‌ను గుర్తు చేసుకోవద్దనే ఈ ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తుందని దుయ్యబట్టారు. మిలియన్ మార్చ్‌ను గుర్తు చేసుకుంటే భూమి బద్దలవుతుందా..?, అధికార పీఠాలు కదిలిపోతాయా..? అని నిలదీశారు. అక్రమంగా అరెస్టు చేసిన 3500 మందిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మధ్యాహ్నం ఒంటిగంటకు తెలంగాణ వాదులు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడు మగ్దుం మోహినుద్దీన్‌ విగ్రహం దగ్గరికి రావాలని పిలుపునిచ్చారు. కెసిఆర్ ఢిల్లీలో పోరాడటానికి ధర్నాచౌక్ కావాలి… కానీ హైదరాబాద్‌లో మాకు ధర్నాచౌక్ ఉండకూడదా అని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజల హక్కుల కోసం తాము హైదరాబాద్ లో ఉద్యమం చేస్తామని కోదండరామ్ వెల్లడించారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో నిర్బంధాలు ఉంటాయని ఊహించలేదన్నారు.

Comments

comments