Search
Sunday 18 November 2018
  • :
  • :
Latest News

సజీవంగానే ఐసిస్ ఛీఫ్

Isis

కైరో /వాషింగ్టన్ : ఎన్ని కష్టాలు నష్టాలూ ఎదురైనా ఓపికగా కార్యాచరణకు దిగుతూనే ఉండాలని ఐసిస్ అధినేత అబూ బకర్ అల్ బాగ్దాదీ పిలు పు నిచ్చారు. చాలా కాలంగా బాగ్దాదీ అజ్ఞాతంలో ఉంటూ వస్తున్నారు. ఇప్పటికీ ఆయన గొంతుతో దాదాపు గంట సేపు సాగిన ప్రసంగపు వీడియోను ఐసిస్ అధికారిక మీడియా విభాగం అల్ ఫర్‌క్వాన్ విడుదల చేసింది. సిరియా, ఇరాక్‌ల్లో ఐసిస్‌కు తీవ్ర నష్టం వాటిల్లిందని, అయితే ఈ పరిణామంతో బెదిరిపోవద్దని, విజయ లక్షంకోసం కార్యాచరణకు దిగుతూ ఉండాలని బాగ్దాదీ పిలుపు నిచ్చారు.

అసలు బాగ్దాదీ బతికే ఉన్నారా? అనే అంశం పలు రకాలుగా మిస్టరీగా మారింది. గత ఏడాది మేలో రష్యా వాయు సైనిక దళాలు జరిపిన దాడులలో బాగ్దాదీ సిరియా నగరం రఖ్ఖా శివార్లలో మృతి చెందారని వార్తలు వెలువడ్డాయి. ఈ ప్రాంతం ఇస్లామిక్ తీవ్రవాద సంస్థకు బలమైన కేంద్రంగా ఉంది. అసలు బాగ్దాదీ ఏ విధంగా ఉంటారనేది ఎవరికీ తెలియదు. 2014 జూలైలో మొసూల్‌లోని అల్ నూరి మసీదులో జరిగిన సభలో ముస్లిం సామ్రాజ్య స్థాపన ఖలిపేట్‌ను స్థాపించేందుకు ఇస్లామిక్ స్టేట్ సంస్థను ఏర్పాటు చేస్తున్నట్లు బాగ్దాదీ ప్రకటించారు.

Comments

comments